నా సామిరంగా.. ఆ లెక్కలపై నాగ్ ఫోకస్

కింగ్ నాగార్జున హీరోగా నా సామి రంగా మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది

Update: 2023-12-31 05:33 GMT

కింగ్ నాగార్జున హీరోగా నా సామి రంగా మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాప్ లతో ఉన్న కింగ్ ఈ మూవీతో ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇదిలా ఉంటే రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని టీజర్ బట్టి క్లారిటీ వచ్చింది. ఇక సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో బిజినెస్ పై కింగ్ నాగార్జున ఫోకస్ పెట్టారు. మొత్తం మూవీ డీల్స్ అన్ని తానే హ్యాండిల్ చేస్తున్నారంట. అలాగే ఏపీలో అన్నపూర్ణ బ్యానర్ నుంచి రిలీజ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి నాగార్జున రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం ఏరియా రైట్స్ ద్వారా వచ్చే మనీని రెమ్యునరేషన్ గా తీసుకోనున్నట్లు టాక్.

డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ కూడా నాగార్జున దగ్గరుండి అమ్మే పనిలో ఉన్నారంట. కచ్చితంగా ఎలా అయిన హిట్ కొట్టడంతో పాటు సాలిడ్ బిజినెస్ చేయడం ద్వారా నిర్మాతని సేఫ్ జోన్ లో ఉంచే పనిలో నాగార్జున ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథని అందించడం విశేషం.

అలాగే ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆఖరులో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ కూడా మూవీలో డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. సంక్రాంతి రేసులో నా సామిరంగాతో పాటు ఏకంగా ఐదు సినిమాలు పోటీలో ఉన్నాయి.

అయితే డిసెంబర్ 14న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మిగిలిన సినిమాల రిజల్ట్ పైన ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి ఆడియన్స్ ఈ చిత్రం వైపు మొగ్గు చూపించే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News