వరుస ఫెయిల్యూర్స్ గురించి అడిగితే క్లాస్ తీసుకున్న సూపర్ స్టార్!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పరాజయాల పరంపర గురించి తెలిసిందే.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పరాజయాల పరంపర గురించి తెలిసిందే. వరుసగా 16 ప్లాప్ లతో ఏకంగా రికార్డు సృష్టించారు. ఇంతవరకూ ఇన్ని వరుస వైఫల్యాలు ఏహీరో చూడలేదు. ఆ రకంగా బాలీవుడ్ లో ఇదో రికార్డు అని చెప్పాలి. ఇక అక్షయ్ ప్లాప్ ల గురించి నెట్టింట ట్రోలింగ్, విమర్శల గురించి తెలిసిందే. ఈ విషయంలో అక్షయ్ ఎంతో బాధపడ్డాడు. తన మనోవేదనని ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఈసారి బాధని వీడి, ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఎలా పనిచేయాలి? అన్న దానిపై పెద్ద క్లాస్ తీసుకున్నారు.
`ప్రతీ సినిమా ఎంతో ఇష్టంతో చేస్తాం. అందులో ప్రాణం పెడతాం. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయితే మనసు ముక్కలవుతుంది. ప్రతీ సినిమా నుంచి ఏదో విషయం నేర్చుకుంటూనే ఉంటా. విజయం సాధించాలనే తప్పన మరింత పెరిగింది. కెరీర్ ఆరంభంలోనే ఈవిషయం అర్దమైంది. పరాజయం బాధిస్తుంది. ఆ బాధ దాని రాతను మర్చలేదు కదా. అది మన అధీనంలో లేనిది.
కష్టపడి పనిచేయడం వరకూ మనం పరిమితం. ఆ విధంగా నాకు నేను ధైర్యం చెప్పుకుని ముందుకెళ్తుంటా. క్రమశిక్షణ, నిజాయితీగా ఉండటమే నా బలం. పుడ్, వర్కౌట్, పని వేళలు ఇలా టైమ్ టేబులు పెట్టుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటా. మానసికంగా, శారీకంగా ధృడంగా ఉండటానికి కారణం అదే. కోవిడ్ తర్వాత చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులొచ్చాయి.
ప్రేక్షకులు కొత్త నేపథ్య మున్న సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా కథలు ఎంపిక చేసుకోవాలి. ఇకపై నేను మరింత జాగ్రత్తగానూ వ్యవరించాల్సి ఉంది` అని అన్నారు. ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన `సర్పిరా` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. `ఆకాశం నీహద్దు రా` సినిమాకి రీమేక్ గా రూపొందింది. సౌత్ లో మంచి విజయం సాధించింది. దీంతో బాలీవుడ్ లో ఈ ఇన్ స్పైరింగ్ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుందనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవి చూసింది.