బ‌జార్ ఇండియాపై మెరుపులా మురిపించిన అలియా!

బాలీవుడ్ సంచ‌ల‌నం అలియాభ‌ట్ ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-05-11 10:19 GMT

బాలీవుడ్ సంచ‌ల‌నం అలియాభ‌ట్ ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డిజైన‌ర్ దుస్తుల్లో అలియా మెరుపు దాడికి యువ‌త ఫిదా అవ్వాల్సిందే. ఎలాంటి డిజైన‌ర్ లోనైనా త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో సంథింగ్ స్పెష‌ల్ గా నిల‌వ‌డం అలియా ప్ర‌త్యేక‌త‌. ఫోటో షూట్ కి త‌గ్గ‌ట్టు అమ్మ‌డు మౌల్డ్ అవ్వ‌డంలో త‌న‌దైన చాక‌చ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. ప‌ర్పెక్ట్ గా ప్లాన్ చేసుకుని మ‌రి వైవిథ్య‌మైన భంగిమ‌ల‌తో అల‌రించ‌డం అలియా భ‌ట్ స్పెష‌లిస్ట్.


తాజాగా అలియాభ‌ట్ మ‌రో న్యూ ఫోటోతో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఇదిగో ఇక్క‌డి బజార్ ఇండియా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫోటో త‌ళుక్కున మెరిసంది. వైట్ అండ్ వైట్ లో అలియా షేక్ చేస్తోంది. కాళ్ల‌కి వైట్ సాక్సెస్..షూస్ ధ‌రించింది. అమ్మ‌డి రూప లావ‌ణ్యాన్ని హైలైట్ చేసేలా ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ లో ఎంతో కాన్పిడెంట్ గా ఉంది. అన్నింటికంటే అలియా హైయిర్ స్టైల్ హైలైట్. ప్యూర్ బ్లాక్ హెయిర్ తో అలియా రొటీన్ కి భిన్నంగా ట్రై చేసింది.


అమ్మ‌డి అందాన్ని ఆ హెయిర్ స్టైల్ మ‌రింత అందంగా హైలైట్ చేస్తుంది. క‌ళ్ల‌కు కాటుక..మ్యాక‌ప్..యాక్స‌ర‌సీన్ ప్ర‌తీది అలియాని ఎంతో అందంగా తీర్చి దిద్దాయి. చైర్ లో అలియా స్టైలిష్ భంగిమ మ‌రింత ఇంట్రెస్టింగ్. టోటల్ గా బ‌జార్ ఇండియాని అలియా మ‌రింత అందంగా హైలైట్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అలియా బ్యూటీకి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. పెళ్లైనా..ఓ బిడ్డ‌కు త‌ల్లైనా ఆమె అందంపై కామెంట్లు మాత్రం అంతే ఇంట్రెస్టింగ్.



ప్ర‌స్తుతం అలియా భ‌ట్ మునుప‌టి అంత వేగంగా సినిమాలు చేయ‌డం లేదు. మాతృమూర్తి అయిన త‌ర్వాత బాధ్య‌త‌లు పెరిగాయి. దీంతో కుటుంబం...ప్రోషెష‌న్ ని రెండింటినీ మ‌రింత బ్యాలెన్స్ గా ముందుకు తీసుకెళ్లాల్సిన ప‌రిస్థితులు. గ‌త ఏడాది రెండు సినిమాలే చేసింది. ఈ ఏడాది మాత్రం `జిగ్రా` అనే సినిమాకి నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తుంది. హీరోయిన్ గా ఇంకా కొత్త ప్రాజెక్ట్ లు వేటికి సైన్ చేయ‌లేదు.

Tags:    

Similar News