దమ్మిడి రాదనకుంటే నిర్మాత ఎందుకు పెట్టాలి?
స్టార్ డైరెక్టర్ ఈ.వీ.వీ సత్యన్నారాయణ వారసుడిగా టాలీవుడ్ కి పరిచయమైన అల్లరి నరేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
స్టార్ డైరెక్టర్ ఈ.వీ.వీ సత్యన్నారాయణ వారసుడిగా టాలీవుడ్ కి పరిచయమైన అల్లరి నరేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు. తండ్రి ఎన్నో వైవిథ్యమైన చిత్రాలతోనూ.. కామెడీ సినిమాలతోనూ ప్రేక్షకులకు దగ్గరైతే...నరేష్ మాత్రం కామెడీ పాత్రలతో ఓ వెలుగు వెలిగి ఇప్పుడిప్పుడే కొత్త టర్నింగ్ తీసుకుని ముందుకెళ్తున్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతోపాటు యాక్షన్ తరహా రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం `ఆ ఒక్కటీ అడక్కు` అనే సినిమా చేస్తున్నాడు. త్వరలో ఆసినిమా ప్రేక్షకు లముందుకు రానుంది. ఈ సదర్భంగా నరేష్ ఇండస్ట్రీ..సక్సెస్ ఫెయల్యూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
`ఇండస్ట్రీలో లైఫ్ ని డిసైడ్ చేసేది కేవలం హిట్ మాత్రమే. విజయం ఉంటే ఇంటి ముందు మన కోసం ఎన్ని కార్లు అయినా ఉంటాయి. సక్సెస్ ..ఫేం..ఫాలోయింగ్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. ఎంతమంది నిర్మాతలైనా లైన్ లో ఉంటారు. అదే లేకపోతే ఎవరూ ఉండరు. అదే ఇండస్ట్రీ. సినిమాలంటే అంతే. అక్కడ తప్పుగా చూడాల్సిన పనిలేదు. ప్లాప్ ల్లో ఉన్న హీరోపైనా...దర్శకుడిపైనా నిర్మాత ఎందుకు డబ్బులు పెడతాడు. అలా పెడితే అతడు పోతాడు కదా. మన వల్ల ఒకరికి డబ్బులొస్తున్నాయంటే మరొకడు పెడతాడు.
అంతేగానీ రూపాయి పెడితే దమ్మిడి రాదనుకున్నప్పుడ అతనెందుకు పెడతాడు. ఇండస్ట్రీలో యాటిడ్యూడ్ గా ఉండటం...యారోగెంట్ గా ఉంటే అవతలి వైపు నుంచి రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. విజయాలునప్పుడు విర్రవీగకూడదు. ప్లాప్ లున్నప్పుడు మూలన కూర్చుని ఏడవ కూడదని నాన్న చెప్పారు. నేను అదే పాలో అవుతున్నా. హిట్లు..పాప్ లు నాకు సమానమే. ఇండస్ట్రీలో నాన్న గారిపై ఎలాంటి వివాదాలుగానీ..విమర్శలు గానీ లేవు. ఆయన పూర్తిగా నాన్ కాంట్రవర్శియల్ పర్సన్. ఆయన చెప్పిందే నేను పాటిస్తున్నా. న్యూట్రల్ గా ఉండటంతో ఎంతో ఉత్తమమైన పని. బ్యాలెన్స్ గా ఉండాలి.
బాగున్నారా అండి అంటే ఎదుటవారు కూడా బాగున్నారా? అండి అంటారా? బాగున్నావా? అంటే అవతలి వాడు అలాగే రియాక్ట్ అవుతాడు. ఏదైనా మనం నడుచుకునే విధానం బట్టే ఉటుంది. మర్యాద ఎరికైనా..ఎవరైనా ఇచ్చి పుచ్చుకోవాలి. నాకొచ్చిన కాంప్లిమేంట్ ఏంటి అంటే? సినిమాలకంటే బయటే బాగున్నాను అంటారు. హీరో అయితే సినిమాల్లోనే కదా? బాగుండాలని నవ్వుకుంటాను. కప్పు కాఫీ తాగుతాను. ఇంకెక్కడా షుగర్ తీసుకోను. తినడం కూడా లిమిట్. బౌల్ పెట్టుకుని తింటాను. ఎంత ఆకలేస్తే అంతే తింటాను. ఓవర్ ఈటింగ్ మంచిది కాదు` అని అన్నారు.