ఫ్యాన్స్ కాదు.. అల్లు ఆర్మీ.. మరోసారి బన్నీ క్లారిటీ
అయినప్పటికీ పుష్ప ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన వల్ల ఆ సక్సెస్ ను ఎవరూ పబ్లిక్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు.
పుష్ప2 రిలీజై బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సినిమా అంత భారీ హిట్ అయినప్పటికీ పుష్ప2కు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ఏదీ నిర్వహించలేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. పుష్ప2 హిట్ అయింది, బాక్సాఫీస్ వద్ద నెక్ట్స్ లెవెల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయినప్పటికీ పుష్ప ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన వల్ల ఆ సక్సెస్ ను ఎవరూ పబ్లిక్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు.
ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బన్నీ బయటికొస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత పుష్ప2 థ్యాంక్స్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ బయటికొచ్చి సినిమా వేడుకకు హాజరైన మొదటి ఈవెంట్ ఇదే. ఈ కార్యక్రమంలో బన్నీ చాలా ఆనందంగా కనిపించడంతో పాటూ తన పాత లుక్ లో దర్శనిమిచ్చాడు.
ఫ్యాన్స్ కు అనుమతి లేని ఈ ఈవెంట్ లో బన్నీ తన ఫ్యాన్స్ గురించి చాలా మాట్లాడాడు. అయితే బన్నీ తన ఫ్యాన్స్ ను ముద్దుగా ఆర్మీ అని పిలుచుకుంటాడనే సంగతి తెలిసిందే. కెరీర్ మొదట్లో మెగా ఫ్యాన్స్ లేనిదే తాను లేనని చెప్పిన బన్నీ గత కొన్ని సినిమాలుగా తనకున్న అభిమానులు ఫ్యాన్స్ కాదని, తనకొక ఆర్మీ ఉందని చెప్తూ వస్తున్నాడు.
అయితే రీసెంట్ గా బన్నీ లీగల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీ ఆర్మీ ఏమైపోయిందని మెగా ఫ్యాన్స్ బన్నీని ప్రశ్నించారు. అయినప్పటికీ బన్నీ నిన్న థ్యాంక్స్ మీట్ లో తన మాటని మార్చుకోకుండా తన ఫ్యాన్స్ ను అల్లు ఆర్మీ అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తనకు సపోర్ట్ చేసి ఈ స్థాయి వరకు తెచ్చిన అల్లు ఆర్మీకి బన్నీ ఈ సందర్భంగా మరో ప్రామిస్ కూడా చేశాడు.
మున్ముందు మీరంతా ఇంకా ఇంకా ఇంకా గర్వపడేలా చేస్తానని చెప్పిన బన్నీ, అల వైకుంఠపురములో సక్సెస్ తన మొదటి స్టెప్ అయితే పుష్ప1, పుష్ప2 తర్వాతి స్టెప్స్ అని, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా అదే స్థాయిలో ఉండనున్నాయని బన్నీ చెప్పాడు. బన్నీ తన ఆర్మీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ కోపం తెప్పిస్తున్నాయి. ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ లేనిదే తాను లేనని చెప్పిన అల్లు అర్జున్, ఇప్పుడు సక్సెస్ వచ్చాక కళ్లు నెత్తికెక్కాయని మెగా అభిమానులు బన్నీపై ఫైర్ అవుతున్నారు.