పుష్ప 2… ఓవర్సీస్ లెక్క ఎంతవరకు వచ్చింది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ ప్రభంజనం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది.

Update: 2024-12-17 05:49 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ ప్రభంజనం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇండియాలోనే కాకుండా రిలీజ్ అయిన అన్ని దేశాలలో అపూర్వ ఆదరణ సొంతం చేసుకొని రికార్డ్ స్థాయి వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమాకి సాధ్యం కానీ స్థాయిలో కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకుంటూ వెళ్తోంది. ఈ సినిమాకి వస్తోన్న ఆదరణ సినీ విశ్లేషకులని సైతం ఆశ్చర్యపరుస్తుంది.

ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1300+ కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో 1500+ కోట్లకి పైగా వసూళ్లని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే హిందీలో అత్యధిక కలెక్షన్స్ చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అని అనుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో 600 కోట్లకి సమీపంలో ఈ మూవీ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ ఏడాది హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా స్త్రీ2 ఉంది.

దీనిని త్వరలోనే ‘పుష్ప 2’ బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇక నార్త్ అమెరికాలో కూడా 13 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకుంది. దీంతో పాటు ఓవర్సీస్ మొత్తం కేవలం 11 రోజుల్లోనే 26.53 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సాధించిందని తెలుస్తోంది. రిలీజ్ అయిన అన్ని దేశాలలో ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు సాధించింది. దీంతో ఓవర్సీస్ లో 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈ సినిమా నమోదు చేసింది.

ఇదే జోరు కొనసాగితే 30 మిలియన్ డాలర్స్ ని ఓవర్సీస్ లో ‘పుష్ప 2’ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు దిశగా ఈ మూవీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ‘బాహుబలి 2’ రికార్డులని కూడా లాంగ్ రన్ లో ‘పుష్ప 2’ బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్ లో దేశాలవారీగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి.

నార్త్ అమెరికా - $12,878,468

యూకే అండ్ ఐర్లాండ్ - $2.05M

న్యూజిలాండ్ - $392K

జర్మనీ - $246K

యూఏఈ&అరబిక్ కంట్రీస్ - $5.05M

సింగపూర్ - $444K

ఆస్ట్రేలియా - $2.4M

మలేషియా - $540K

నేపాల్ - $1.1M

శ్రీలంక - $131K

రెస్ట్ ఆఫ్ ది యూరప్ - $1.3M

ఓవరాల్ కలెక్షన్స్ - $26.53

Tags:    

Similar News