'పుష్ప 2' కోసం అందాల యానిమల్‌...!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2024-09-09 05:48 GMT

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతూనే ఉన్నాయి. పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో పుష్ప 2 అంతకు మించి అనే స్థాయిలో రూపొందుతోంది. ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు పుష్ప 2 వెయ్యి కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ కాస్త ఎక్కువ సమయం తీసుకుని పుష్ప 2 ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

పుష్ప 1 లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఊ అంటావా.. అంటూ ఐటెం సాంగ్‌ ను చేసిన విషయం తెల్సిందే. ఆ పాట కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మొత్తం పాన్ ఇండియాలో ట్రెండ్‌ అయింది. ఆ పాటకు దక్కిన స్పందన వల్ల సినిమా స్థాయి మరింత పెరిగింది, వసూళ్లు కూడా అంతకు మించి అన్నట్లుగా నమోదు అయ్యాయి అనేది కొందరి అభిప్రాయం. ఊ అంటావా... పాటకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ఐటెం సాంగ్‌ ను ప్లాన్‌ చేయాల్సిన బాధ్యత సుకుమార్‌ పై ఉంది. మళ్లీ సమంతతో చేయించాలని చాలా మంది కోరుకున్నా బాలీవుడ్‌ స్టార్‌ తో ఐటెం సాంగ్ చేయించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2 ఐటెం సాంగ్ ఇప్పటి వరకు షూట్‌ జరగలేదు. చివరకు షూట్ చేయబోతున్న ఆ పాట లో నటించబోతున్న హీరోయిన్ గురించి గత కొన్ని నెలలుగా పుకార్ల మీద పుకార్లు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌ కు చెందిన పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలించిన మేకర్స్ చివరకు యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జాన్వీ కపూర్‌ తో ఐటం సాంగ్ చేయించబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ ప్రస్తుతానికి ఐటం సాంగ్‌ చేసేందుకు నో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

జాన్వీ కపూర్‌ నో చెప్పడంతో యానిమల్‌ సినిమాలో తన అందాలతో మెప్పించి, రణబీర్ కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చి పోయిన తృప్తి దిమ్రి తో ఐటెం సాంగ్‌ చేయించడం ద్వారా బాలీవుడ్‌ లో కూడా పుష్ప 2 వెయిట్‌ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్ చేయించడం ద్వారా క్రేజ్ మరింత పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్‌ మరోసారి కచ్చితంగా ఓ భారీ బ్లాక్‌ బస్టర్ ఐటెం ట్యూన్ ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి హీరోయిన్‌ పడితేనే ఊ అంటావా.. స్థాయిలో హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి పుష్ప 2 ఐటం సాంగ్‌ బ్యూటీ ఎవరు అనేది ఎప్పటికి తెలుస్తుందో చూడాలి. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News