సునామీ ముందు సంద్రంలా పుష్ప రాజ్

దీనికితోడు కొన్నేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో తనదైన మార్కును చూపించడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయాడు

Update: 2024-10-17 10:05 GMT

టాలీవుడ్ బడా నిర్మాత కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీనికితోడు కొన్నేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో తనదైన మార్కును చూపించడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయాడు. అదే సమయంలో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును సైతం అందుకున్నాడు.

‘పుష్ప ది రైజ్’ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి స్పందనను అందుకుని విజయాన్ని సాధించడంతో దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్’ మూవీని తీస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఫలితంగా మొదటి పార్టుకు మించే సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లను పెడుతూ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టర్‌ను మరింతగా ఎలివేట్ చేసేలా ప్లాన్లు చేస్తున్నారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘పుష్ప ది రూల్’ సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో పోస్టర్లు, వీడియోలు, సాంగ్స్ విడుదల అయ్యాయి. వాటన్నింటికీ ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దీంతో చిత్ర యూనిట్ మరింత ఉత్సాహంతో ప్రచార చిత్రాలను వదలుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప ది రూల్’ సినిమా విడుదలకు ఇంకా 50 రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఇందులో బన్నీ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని సీరియస్ మోడ్‌లో కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సునామీ వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

‘పుష్ప ది రూల్’ మూవీ నుంచి తాజాగా వచ్చిన అల్లు అర్జున్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే ఫుల్ వైరల్‌గా మారిపోయింది. అలాగే, ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కూడా మరింతగా పెరిగిపోయాయి. ఇక, పుష్పరాజ్ పోస్టర్‌పై సామాన్య సినీ ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ మూవీలో అల్లు అర్జున్ తనదైన నటన, మేనరిజంతో మైమరపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప ది రూల్’లో అంతకు మించేలా తన పెర్ఫార్మెన్స్‌ను చూపించబోతున్నాడట. ఇందుకోసం గతంలో చేయని ఎన్నో రిస్కీ షాట్లను కూడా చేసినట్లు తెలిసింది. అలాగే, డ్యాన్స్ విషయంలో అస్సలు తగ్గలేదని అంటున్నారు.

Tags:    

Similar News