పుష్ప 2 ఈవెంట్స్.. వెనక నడిపిస్తుంది అతనేనా..?
బన్నీ వెనక ఉండి లొకేషన్ ఇంకా ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నాడని టాక్. తన సినిమా జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీద వేసుకున్నాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి అయిన పుష్ప 2 సినిమా పై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు ఏంటో మొన్న పాట్నా ఈవెంట్ చూసి గెస్ చేయొచ్చు. పుష్ప 2 కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. సుకుమార్ అందుకే ఆ అంచనాలకు తగినట్టుగానే ప్రతి యాస్పెక్ట్ ఉండేలా చూస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 మొదటి ఈవెంట్ పట్నాలో సూపర్ హిట్ కాగా నవంబర్ 24న చెన్నైలో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
కోలీవుడ్ లో తెలుగు హీరో మాస్ ఈవెంట్ ప్లానింగ్ జరుగుతుంది. మరోపక్క కేరళలో కూడా పుష్ప 2 ఈవెంట్ ప్లానింగ్ జరుగుతుందని తెలుస్తుంది. నవంబర్ 27న కొచ్చిలో పుష్ప 2 స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. కేరళలో అల్లు అర్జున్ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. మల్లూవుడ్ లో అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే.
అందుకే పుష్ప 2 ని కొచ్చిలో భారీగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నార్త్ లో అదే పాట్నాలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామాకి ఈవెంట్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా కేరళ గడ్డ మీద అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ఈవెంట్ కు కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు తెలుస్తుంది.
బన్నీ వెనక ఉండి లొకేషన్ ఇంకా ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నాడని టాక్. తన సినిమా జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీద వేసుకున్నాడు అల్లు అర్జున్. మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్ వెనకాల కూడా అల్లు అర్జున్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. సో బన్నీ పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ తర్వాత తన మాస్ స్టామినా చూపించేందుకు సిద్ధం అంటున్నాడు అల్లు అర్జున్.
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం 1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. పుష్ప 2 పై ఉన్న బజ్ ని రోజు రోజుకి మరింత పెంచేస్తున్నారు మేకర్స్.