పుష్ప 2 ఆ టార్గెట్ కష్టమేమి కాదు..!

ఏ ముహూర్తాన పుష్ప మొదలు పెట్టారో కానీ ఆ సినిమా రెండు భాగాల ప్లాన్ ఒక ఎత్తైతే సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడం మరో ఎత్తని చెప్పొచ్చు

Update: 2024-02-22 12:57 GMT

ఏ ముహూర్తాన పుష్ప మొదలు పెట్టారో కానీ ఆ సినిమా రెండు భాగాల ప్లాన్ ఒక ఎత్తైతే సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడం మరో ఎత్తని చెప్పొచ్చు. ఈ క్రమంలో పుష్ప 1 బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పుష్ప రాజ్ పాత్రకు బాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ ఉన్న మాస్ ఆడియన్స్ ని మెప్పించిన పుష్ప అదరగొట్టాడు. ఇక పుష్ప 1 బజ్ ని కొనసాగించేలా పుష్ప 2 రాబోతుంది.

పుష్ప 2 సినిమా భారీ స్కేల్ లో వస్తుంది. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ అయితే సూపర్ హిట్ అయ్యింది. పుష్ప ప్రతి అప్డేట్ పై సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ సైడ్ ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పుష్ప 2 ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం నెవర్ బిఫోర్ రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

పుష్ప 1 తో 500 నుంచి 600 కోట్ల దాకా గ్రాస్ రాబట్టగా పుష్ప 2 లో బిగ్ టార్గెట్ పెట్టుకుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే మాత్రం పుష్ప 2 1000 కోట్లు టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పొచ్చు. పుష్ప 2 కి వచ్చిన ఈ బజ్ కి కచ్చితంగా అది సాధ్యం అవుతుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సుకుమార్ అల్లు అర్జున్ ఈ కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప 1 మేనియా కొనసాగించేలా పుష్ప 2 ని ఆ సినిమాను మించి నిలబెట్టాలని చిత్ర యూనిట్ కృషి చేస్తున్నారు. పుష్ప 2 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విషయంలో పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడట సుక్కు. పుష్ప 2 ఓపెనింగ్.. ఇంటర్వల్.. సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్.. క్లైమాక్స్ హై ఇవన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలిచేలా చేస్తున్నారట. తప్పకుండా పుష్ప 2 ఆడియన్స్ కు హై ఇవ్వగలిగితే మాత్రం 1000 కోట్లు పెద్ద లెక్కేం కాదని చెప్పొచ్చు. మరి అల్లు అర్జున్ ఖాతాలో 1000 కోట్లు పడతాయా లేదా అన్నది ఆగష్టు 15న తెలుస్తుంది.

Tags:    

Similar News