ఫోటో స్టోరి: తగ్గేదేలే పుష్పా
మిలీ నటి జాతీయ అవార్డ్ అందుకోవడమే కాదు.. జాతీయ అవార్డ్ అందుకున్న ఉత్తమ నటుడు అల్లు అర్జున్ తో కలిసి ఈ సాయంత్రం వేళ చాలా సరదాగా గడిపేసింది.
చూస్తుంటే ఇది పుష్పరాజ్ కే సవాల్ విసిరినట్టుగా ఉంది. తగ్గేదే లే! అంటూ బన్నీకే సవాల్ విసురుతోంది కృతి. మిలీ నటి జాతీయ అవార్డ్ అందుకోవడమే కాదు.. జాతీయ అవార్డ్ అందుకున్న ఉత్తమ నటుడు అల్లు అర్జున్ తో కలిసి ఈ సాయంత్రం వేళ చాలా సరదాగా గడిపేసింది. ఈ మంగళవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ జాతీయ నటి .. ఉత్తమ జాతీయ నటుడు పురస్కారాల్ని అందుకుని ఆ ఇద్దరూ గర్వంగా కనిపించారు. ఆనందం ఆవర్ణమవుతుండగా, జంటగా ఓ చోట చేరి చేసిన సందడి అంతా ఇంతా కాదు. బన్ని- కృతి జంట ఎంతో చూడముచ్చటగా కనిపించారు ఈ వేదిక వద్ద. ఆ ఇద్దరూ చాలా సేపు ముచ్చట్లాడుతూ కనిపించడమే గాక షో స్టాపర్ గా నిలిచారు.
పురస్కార గ్రహీత కృతి సనోన్ మాట్లాడుతూ .. ఈ ఆనందాన్ని అందమైన భావనను మాటల్లో వర్ణించడం అంత సులభం కాదు అని వ్యాఖ్యానించింది. జాతీయ అవార్డులు గెలుచుకున్న తర్వాత కృతి సనన్ తల్లిదండ్రులతో పోజులిచ్చింది. తన చిత్రం మిమీకి ప్రతిష్టాత్మక 69వ ఎడిషన్‌లో తన మొదటి జాతీయ అవార్డును అందుకుంది.
కృతి ఫోటోలపై స్పందిస్తూ, .. మృణాల్ ఠాకూర్ "అభినందనలు (ఎరుపు గుండె) అంకుల్ - ఆంటీ చిరునవ్వు ఉఫ్! విలువైనది" అని రాశారు. అథియా శెట్టి ఎర్రటి హృదయం ఈమోజీని షేర్ చేసింది. సన్యా మల్హోత్రా, 'అభినందనలు (ఎమోజి, రెడ్ హార్ట్ .. హార్ట్-ఐ ఎమోజీలు) అని వ్యాఖ్యానించారు. మరోవైపు కృతి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి అవార్డును అందుకున్న ఫోటోలు, వీడియోను ప్రత్యేక పోస్ట్‌లో షేర్ చేసారు. 'ది బిగ్ మూమెంట్!!' నిన్ను మిస్ అయ్యాను #Dinoo & @laxman.utekar!! చాలా చాలా.. అని వ్యాఖ్యను జోడించింది కృతి.
ఈ కార్యక్రమంలో, కృతి దూరదర్శన్‌తో మాట్లాడుతూ, "మొదట ఇదేమీ అంత సులువుగా ఏం లేదు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడానికి నాకు 9 సంవత్సరాలు పట్టింది. అయితే ఒక దశాబ్దంలో జాతీయ అవార్డును గెలుచుకున్నానని నాకు అర్థమైంది. చాలా చాలా పెద్ద విషయం"అని తెలిపింది. 2021లో విడుదలైన కామెడీ-డ్రామా మిమీ గురించి చెబుతూ.. ఇది తన అదృష్టమని కృతి పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం లో మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, సాయి తమంకర్, మనోజ్ పాహ్వా, సుప్రియా పాఠక్ నటించారు.
కృతి సనన్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. చివరిసారిగా పౌరాణిక ఇతిహాసం ఆదిపురుష్‌లో కనిపించింది కానీ అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ -అమితాబ్ బచ్చన్‌లతో కలిసి డిస్టోపియన్ యాక్షన్ చిత్రం గణపత్ లో నటించింది. తదుపరి టైటిల్ లేని రొమాంటిక్ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. కరీనా కపూర్, టబు, దిల్జిత్ దోసాంజ్‌లతో కలిసి 'ది క్రూ'లో కనిపించనుంది. మరోవైపు 'దో పట్టి' చిత్రంతో నిర్మాతగా కూడా మారిపోయింది. కాజోల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కనికా ధిల్లాన్ దర్శకత్వం వహిస్తున్నారు.