క‌ల్కీ జాత‌ర ఇక్క‌డా? అక్క‌డా? తేలేదెప్పుడు?

కానీ ఉన్న స‌మ‌యంలో అన్నింటిని క‌వ‌ర్ చేయ‌డం అన్న‌ది అసాధ్య‌మే.

Update: 2024-06-19 04:51 GMT

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క్వంలో తెర‌కెక్కుతోన్న 'క‌ల్కి 2898'పై ఎలాంటి అంచ‌నాలు న్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 27న రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా వారం రోజులే స‌మ‌యం ఉంది. కానీ ఇంత‌వ‌ర‌కూ ప్ర‌చార కార్య‌క్ర‌మాలేవి మొద‌ల‌వ్వ‌లేదు. ఇండియా వైడ్ మెట్రో పాలిట‌న్ సిటీస్ అన్నింటిని క‌వ‌ర్ చేస్తూ ఈవెంట్లు చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఉన్న స‌మ‌యంలో అన్నింటిని క‌వ‌ర్ చేయ‌డం అన్న‌ది అసాధ్య‌మే.

ముంబై, చెన్నై, హైద‌రాబాద్ లాంటి చోట మాత్ర‌మే ఈవెంట్లు చేస్తార‌ని తాజాగా వెలుగులోకి వ‌స్తోంది. వాస్త‌వానికి అమ‌రావ‌తిలోనే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్న‌ట్లు తొలుత ప్ర‌చారం సాగుతోంది. చిత్ర నిర్మాణ వ‌ర్గాల నుంచి కూడా ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. చిత్ర నిర్మాత అశ్వీనిద‌త్ -ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా త‌ప్ప‌కుండా అక్క‌డ చేసే అవ‌కాశం ఉంద‌ని అంతా భావించారు.

చంద్ర‌బాబు నాయుడు రాక‌తో ఇండ‌స్ట్రీ సైతం ఊపిరి పీల్చుకున్న నేప‌థ్యంలో త‌మ వంతుగా క‌ల్కి ఈవెంట్ నిర్వ‌హించే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం సాగింది. అయితే అమ‌రావ‌తి ఈవెంట్ అక్క‌డ జ‌ర‌గ‌డం లేద‌ని తాజాగా వార్త‌లొస్తున్నాయి. అక్క‌డ ఈవెంట్ పై ప్ర‌భాస్ అసంతృప్తిగా ఉన్నాడ‌ని ప్ర‌చారం సాగుతుంది. అక్క‌డ ఈవెంట్ నిర్వ‌హించొద్ద‌ని, హైద‌రాబాద్ లో చేస్తేనే బాగుంటుంది అన్న‌ట్లుగా సూచించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అలాగే మ‌రో బ‌ల‌మైన కార‌ణం కూడా తెర‌పైకి వ‌స్తోంది. అమ‌రావ‌తిలో ఆ రోజు వాతావ‌ర‌ణం అనుకూలించ‌క పోవ‌చ్చని కూడా అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌ధానంగా ఈ కార‌ణంతోనే ఈవెంట్ ని అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ కి మారుస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈవెంట్ చేస్తే బాగుంటుంద‌ని ఏపీ ప్ర‌జ‌లంతా కోరుకుంటున్న‌ది వాస్త‌వం.

Tags:    

Similar News