సూపర్ స్టార్ ఏంటి అలా అనేసాడు?
ఈ నేపథ్యంలో సినిమా గురించి అమీర్ ఖాన్ మరోసారి స్పందించారు. 'కోవిడ్ సమయంలో ఈసినిమా ఆలోచన వచ్చింది.
బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్' ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు కొంతమంది కలిసి చూసారు. వీళ్లతో పాటు చిత్ర దర్శకులు రాలు కిరణ్ రావ్, నిర్మాత అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈనేపథ్యంలో సినిమా గురించి అమీర్ ఖాన్ మరోసారి స్పందించారు. 'కోవిడ్ సమయంలో ఈసినిమా ఆలోచన వచ్చింది.
అప్పుడు నా వయసు 56. కెరీర్ పరంగా ఇది చిరవి దశ అనిపించింది. మహా అయితే మరో 15 ఏళ్లు పనిచేయగలను. 70 ఏళ్ల తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో తెలియదు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. దేశం, సమాజం, పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వాలనుకున్నా. నటుడిగా ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయగలను. కానీ నిర్మాతగా చాలా కథలను నిర్మింగచలను.
గొప్ప కథలని ప్రేక్షకులకు అందించగలను. ఆరకంగా నూతన నటీనటులు, దర్శకులకు అవకాశాలు ఇవ్వగలను. దీనిలో భాగంగా లాపతా లేడీస్ చేసాను. ఏడాదికి ఐదారు సినిమాలు నిర్మించాలను కుంటున్నా' అని అన్నారు. ఈసినిమా అంత ఈజీగా జరగలేదు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే టెన్షన్ ఉండేది. ఎందుకంటే సినిమా..దానికి సంబంధించిన బిజినెస్ ఎంతో మారింది.
ఇందులో స్టార్స్ లేరు. గ్లామర్ సన్నివేశాలు లేవు. దీంతో డైరెక్ట్ గా ఓటీటీలోనే విడదుల చేద్దామని చాలా మంది అమీర్ కి సలహాలిచ్చారు. కానీ ఆయన మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి చేసినందుకు సంతోషంగా అనిపించింది' అని కిరణ్ రావ్ అన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఇతివృత్తం ఆధారంగా దీన్నితెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు మాత్రం తెచ్చి పెట్టలేదు.