మహేష్ బాబు హీరోయిన్ కనుమరుగవ్వడం వెనక..!
ప్రముఖ బాలీవుడ్ తారలతో కలిసి పనిచేసి అటుపై చిన్న వయస్సులోనే నటనను విడిచిపెట్టి వివాహం చేసుకున్నారు నటి అమృతారావు.
బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు తమ తొలి చిత్రంతోనే సూపర్‌స్టార్‌గా మారారు. అయితే వారు తమ కెరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే పరిశ్రమను విడిచిపెట్టాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించిన ప్రముఖ హీరోయిన్లు పలువురు అనూహ్యంగా తెరమరుగవ్వడం అభిమానులకు నిజమైన షాక్. షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, షాహిద్ కపూర్, సన్నీ డియోల్ సహా పలువురు ప్రముఖ బాలీవుడ్ తారలతో కలిసి పనిచేసి అటుపై చిన్న వయస్సులోనే నటనను విడిచిపెట్టి వివాహం చేసుకున్నారు నటి అమృతారావు. సూపర్ హిట్ చిత్రాల్లో నటించినా కెరీర్ గ్రోత్ ఉన్నా కానీ అమృతారావు నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అమృత రావు షాహిద్ కపూర్‌తో మూడు చిత్రాలలో నటించారు.. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అమృతారావు 2002లో అబ్ కే బరాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2003లో అమృతారావు షాహిద్ కపూర్ సరసన ఇష్క్ విష్క్‌లో నటించింది. ఇది ఆమె మొదటి సూపర్‌హిట్ చిత్రం. ఇష్క్ విష్క్ చిత్రానికి అమృతరావు పలు అవార్డులను గెలుచుకున్నారు. అమృతరావు 2007లో అతిధి అనే తెలుగు చిత్రంలో మహేష్ బాబు సరసన నటించారు.
షారుఖ్ ఖాన్‌తో మై హూనా, సన్నీ డియోల్‌తో సింగ్ సాహెబ్ ది గ్రేట్, అజయ్ దేవగన్‌తో ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, ప్యారే మోహన్, మస్తీ, జాలీ ఎల్‌ఎల్‌బి మొదలైన చిత్రాల్లో అమృత నటించారు. అనంతరం రేడియో జాకీ అన్మోల్ సూద్‌ను వివాహం చేసుకున్నారు. 15 మే 2016 న ఈ జంట వీర్ అనే కొడుకుకు తల్లిదండ్రులయ్యారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి పలికిన అమృతారావు ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.
అమృతరావు చిత్రాపూర్ సారస్వత్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఆమె ముంబైలోని కనోస్సా గర్ల్స్ స్కూల్‌లో చదువుకుంది. అమృతా రావు సైకాలజీలో గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించడానికి ముంబైలోని సోఫియా కాలేజీకి వెళ్ళింది. అయితే మోడలింగ్ ఆఫర్లు రావడంతో డిగ్రీని పూర్తి చేయలేదు. అమృతారావు కెరీర్ పెళ్లి తర్వాత నిల్ అయింది. ఇక అమృతారావు చెల్లెలు ప్రీతికా రావు పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.