'కల్కి' సీక్వెల్‌పై మెగాస్టార్ హింట్..!
ఆ విషయాల గురించి పక్కన పెడితే నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్ ఎప్పుడు మొదలు పెట్టే వియమై క్లారిటీ ఇవ్వడం లేదు.;
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్‌లో కథను ఆసక్తికర పాయింట్ వద్ద ముగించడంతో పార్ట్ 2పై అంచనాలు పెంచారు. దీపికా పదుకునే ను ప్రభాస్ ఎలా కాపాడుతాడు, అందుకోసం అమితాబ్ బచ్చన్ ఎలాంటి సహాయం చేస్తాడు అనేది సెకండ్ పార్ట్ కథ అయి ఉంటుంది అని కొందరి విశ్లేషణ. ఆ విషయాల గురించి పక్కన పెడితే నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్ ఎప్పుడు మొదలు పెట్టే వియమై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నుంచి ఆ విషయమై క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16ను చేస్తున్నారు. ఆ షో ఒక ఎపిసోడ్‌లో కల్కి సినిమా గురించి స్పందించాడు. ఆ సినిమాలోని తన పాత్ర గురించి బిగ్‌బి ప్రేక్షకులతో చెప్పుకొచ్చాడు. తాను సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కేబీసీ 16 షూటింగ్ పూర్తి చేసిన తర్వాత కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్‌కి హాజరు కావాల్సి ఉందని అమితాబచ్చన్ ప్రకటించాడు. కల్కి 2 కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, అందులో తాను కూడా ఉంటాను అంటూ అమితాబచ్చన్ తన ఆసక్తిని చెప్పుకొచ్చారు. ఆకట్టుకునే కథ, కథనంతో ఈ సినిమాను నాగ్ అశ్విన్ రూపొందిస్తాడనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశారు.
'కల్కి 2' షూటింగ్‌కి జూన్ లేదా జులై నుంచి హాజరు కాబోతున్నట్లు అమితాబ్ మాటలను బట్టి అర్థం అవుతుంది. గతంలో నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ మాట్లాడుతూ కల్కి 2 సినిమా షూటింగ్ కొంత మేరకు పూర్తి చేసినట్లు పేర్కొన్నాఉ. 30 శాతం షూటింగ్ పూర్తి చేశామని, కీలక సన్నివేశాల షూటింగ్స్ బ్యాలన్స్ ఉన్నాయని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ సైతం పెద్ద ఎత్తున ఉందని పేర్కొన్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ జూన్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాదికి పూర్తి చేస్తారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2 సినిమా కథపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా పార్ట్ 2లో రాబోతున్న కొత్త పాత్రల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రాజాసాబ్ సినిమాను ఈ సమ్మర్ చివరి వరకు పూర్తి చేయాలని మారుతి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా త్వరలో స్పిరిట్ సినిమాను సైతం ప్రభాస్ సినిమాను చేయబోతున్నాడు. సందీప్ వంగ ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. యానిమల్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు సలార్ 2 సినిమా సైతం లైన్‌లో ఉంది. ఆ సినిమా ఎప్పుడు షూటింగ్ ఉంటుంది అనేది చూడాలి. మొత్తానికి ప్రభాస్ నుంచి రాబోయే మూడు ఏళ్లలో అర డజను సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.