నేను ఏసీలో ఉన్నాను.. రజనీ నేలపై పడుకున్నాడు: అమితాబ్
అమితాబ్ మాట్లాడుతూ-'' హమ్ షూటింగ్ సమయంలో నేను నా AC వాహనంలో విశ్రాంతి తీసుకుంటాను. విరామ సమయంలో రజనీ నేలపై పడుకునేవాడు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆల్మోస్ట్ దివాళా స్థితి నుంచి ఎలా కమ్ బ్యాక్ అయ్యారో ది గ్రేట్ రజనీకాంత్ తాజా సినిమా 'వెట్టైయన్' ప్రమోషన్స్ లో వెల్లడించిన తీరు హృదయాలను టచ్ చేసింది. కేవలం మూడేళ్లలోనే అమితాబ్ కంబ్యాక్ అయ్యారు. వేలం వేసిన అతడి ఇల్లు సహా అదే వీధిలో మరో మూడు చోట్ల ప్రాపర్టీస్ కొన్నారు! అని రజనీకాంత్ తెలిపారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బ్యానర్ పై సినిమాలు నిర్మించిన అమితాబ్ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని రజనీ ప్రస్థావించారు. అమితాబ్ ని చూసి బాలీవుడ్ జనం నవ్వుకున్నారని కూడా అన్నారు.
ఇక ఇదే వేదికపై రజనీకాంత్ గురించి, అతడి ఒదిగి ఉండే స్వభావం గురించి అమితాబ్ బచ్చన్ చెప్పిన విషయాలు ప్రజల హృదయాలను తాకాయి. 33 సంవత్సరాల తర్వాత 'వేట్టయాన్' సినిమాలో ఆ ఇద్దరూ కలిసి నటించారు. ప్రచార కార్యక్రమంలో నాటి క్లాసిక్ మూవీ 'హమ్' షూటింగ్‌లో రజింకాంత్ వినయాన్ని బిగ్ బి గుర్తు చేసుకున్నారు. 1991 లో విడుదలైన హమ్ లో రజనీకాంత్, గోవింద ఇద్దరూ బచ్చన్ తమ్ముళ్ల పాత్రలో నటించారు. అమితాబ్ మాట్లాడుతూ-'' హమ్ షూటింగ్ సమయంలో నేను నా AC వాహనంలో విశ్రాంతి తీసుకుంటాను. విరామ సమయంలో రజనీ నేలపై పడుకునేవాడు. అతడు చాలా సాదాసీదాగా ఉండటం చూసి, నేను వాహనం నుండి బయటకు వచ్చి బయట విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యతనిచ్చాను''అని బచ్చన్ తన వీడియో సందేశం(వేదిక వద్దకు అమితాబ్ రాలేదు)లో చెప్పారు. ఇది వేట్టయాన్ ఆడియో లాంచ్ సందర్భంగా ప్లే అయింది. ఈ ఇద్దరు లెజెండ్స్ అంధా కానూన్, గెరాఫ్తార్ చిత్రాల్లో కూడా నటించారు.
వెట్టైయన్‌కి TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. అతడు చివరిగా సూర్య నటించిన తమిళ లీగల్ డ్రామా జై భీమ్‌కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న వేట్టైయ్యాన్ చిత్రంలో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, వీజే రక్షన్ తదితరులు నటించారు.