హనుమాన్ బ్యూటీ నేర్చుకున్నవి ఇవే!
నటనా ప్రాధాన్యమున్న పాత్రలంటే ఇష్టం. అలాగే డాన్సు అయినా ఎంతో ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్దంగా ఉన్నా.
'రెడ్'..'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' వంటి చిత్రాలతో అలరించిన అమృత అయ్యర్ సుపరిచితమే. ఈ బ్యూటీ ఇటీవల రిలీజ్ అయిన 'హనుమాన్' లో తేజ సజ్జాకు జోడీగా నటించి మెప్పించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాకి మంచి ప్రశంసలు దక్కుతోన్న సంగతి తెలిసిందే. కంటెంట్ ఉంటే? కటౌట్ తో పనిలేదని ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తున్న సినిమాగా కనిపిస్తుంది. దీంతో అమృత పాత్రకి మంచి గుర్తింపు దక్కుతుంది.
మొదటి రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వప్పటికీ మూడవ సినిమా మాత్రం ప్రశంసలు తెచ్చిపెడుతుంది. ప్రధమార్ధంలో హీరోయిన్ నే హీరో అని పొగిడేస్తున్నారు. ఇక ఈ విజయంతో అమ్మడికి కొత్త అవకాశాలు రావడం ఖాయమనుకొచ్చు. ఓ భారీ విజయం ఉంటే వెంట అవకాశాలు వాటంతటవే వస్తాయి. తాజాగా ఈ బ్యూటీకి సినిమా అంటే ఎంత ఫ్యాషన్ అన్నది తెలుస్తుంది. ఆన్ సెట్స లో ఎంత కమిట్ మెంట్ తో పనిచేస్తుందన్నది తాజాగా రివీల్ చేసింది.
'హనుమాన్' ముందు వరకూ నాకు సరైన అవకాశాలు రాలేదు. ఎందుకంటే ఎవరికైనా ఓ హిట్ పడ్డాకే వారిపై దృష్టి పడేది. ఇప్పుడీ విజయంతో మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఏర్పడుతుంది. నటనా ప్రాధాన్యమున్న పాత్రలంటే ఇష్టం. అలాగే డాన్సు అయినా ఎంతో ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్దంగా ఉన్నా. నేను సెట్ లో ఉంటే ఫోన్ చూడను. కార్వాన్ లోకి వెళ్లి రిలాక్స్ అవ్వను.
ఆన్స్ సెట్స్ లో చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలిస్తుంటా. ఎందుకంటే ప్రతీ ఒక్కరి నుంచి ఏదో ఒక నేర్చుకునే అంశం ఉంటుంది. తమిళ హీరో విజయ్ ని చూసి ఈ అలవాటు చేసుకున్నా. ఆయన కార్వాన్ లో పెద్దగా ఉండరు. షూటింగ్ లో తన సీన్ అయిపోయినా పక్కనూ కూర్చుని అన్ని చూస్తుంటారు. ఇది చాలా మంచి అలవాటు. ఏసీ రూమ్ లో కూర్చుంటే ఏం తెలియదు. అందుకే సెట్స్ లో అలా ఉంటా' అని అంది.