కాబోయే భార్యకు అనంత్ అంబానీ ఎన్ని హగ్గులో
మూడో రోజు ఈవెంట్ కి సంబంధించిన ఫోటోల్లో కొత్త జంట ఎంతో ముచ్చట గొలిపింది.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల 3వ రోజు ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ - రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జంట అన్యోన్యతకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. కలిసే పెరిగారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు.
మూడో రోజు ఈవెంట్ కి సంబంధించిన ఫోటోల్లో కొత్త జంట ఎంతో ముచ్చట గొలిపింది. అతిథులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా వేదికపైకి వెళ్లే సమయంలో రాధిక మెరిసే బంగారు రంగు లెహంగాతో కనిపించింది. వేడుకలో పలుమార్లు కాబోయే దంపతులు ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు హత్తుకుని ప్రేమను కురిపించారు. రాధిక కాబోయే భర్త చేతులు పట్టుకుని లాలనగా కనిపించారు. అనంత్ అంబానీ తన భాగస్వామిని వేదికపైకి స్వాగతిస్తున్నప్పుడు ప్రేమగా చేతులు అందుకుని స్వాగతించాడు. ఆ సమయంలో సాంప్రదాయ భారతీయ షేర్వాణీ ధరించారు.
ఒక కాక్టెయిల్ ఈవెంట్ సందర్భంగా రాధికపై తనకున్న అపరిమితమైన ప్రేమను అనంత్ బహిర్గతం చేసాడు. అనంత్ అంబానీ తన కాబోయే భార్యతో భావాల తీవ్రతను స్పష్టంగా వివరించి, ఏడేళ్ల క్రితం రాధిక హృదయాన్ని గెలుచుకున్నందుకు విస్మయం వ్యక్తం చేసారు. భార్యపై అనంత్ అంబానీ అపరిమిత ప్రేమ గురించి వేదిక వద్ద చర్చ సాగింది.
ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలో తన ప్రత్యేకమైన అద్భుతమైన లుక్స్‌తో హెడ్ టర్నర్ గా మారారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల 2వ రోజున ఇషా ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ లెహంగాలో కనిపించింది. నీతా అంబానీ కోసం సంప్రదాయ బంగారు వర్ణం డిజైనర్ చీరను మనీష్ జీ రూపొందించారు.