పెళ్లి ముగిసింద‌ని సంబ‌ర‌ప‌డే లోగానే అంబానీ ఊహించ‌ని షాక్‌లు!

పెళ్లి ముగిసింద‌ని సంబ‌ర ప‌డే లోగానే..! పెళ్లిని త‌లద‌న్నేది మ‌రొక‌టి ప్లాన్ చేసాడు ముఖేష్ అంబానీ

Update: 2024-07-25 17:11 GMT

పెళ్లి ముగిసింద‌ని సంబ‌ర ప‌డే లోగానే..! పెళ్లిని త‌లద‌న్నేది మ‌రొక‌టి ప్లాన్ చేసాడు ముఖేష్ అంబానీ. 5000 కోట్లు ఖ‌ర్చు చేయ‌డానికి మూడు సార్లు పెళ్లి వేడుక‌లను నిర్వ‌హించాడు కానీ, ఈసారి ఒక్క పెళ్లి అనంత‌ర వేడుక‌ల‌కే అత‌డు ఏకంగా 5000 కోట్లు లేదా అంత‌కుమించి ఖ‌ర్చు చేసేందుకు తెర తీసాడ‌ని ఇప్పుడు కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజు గారు త‌లుచుకుంటే కొర‌డా దెబ్బ‌ల‌కు కొదవా? అన్న‌ట్టు ఒక‌రు ఎన్నిసార్లు అయినా అదే పెళ్లిని రీపీటెడ్ గా చేసుకోవ‌చ్చు.. దానిని సెల‌బ్రేష‌న్ గా మార్చి స్టాక్ మార్కెట్లో పెళ్లి ఖ‌ర్చులు సంపాదించుకోవ‌డ‌మే గాక‌, తిరిగి దానికి ప‌దింత‌లు లాభాలు తెచ్చుకోవ‌చ్చ‌ని నిరూపించ‌వ‌చ్చు. చాణ‌క్యులైన అంబానీలు ఏం చేసినా అది చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది అందుకే!

భారతదేశంలో మూడు సార్లు గ్రాండ్ వెడ్డింగ్ పార్టీల తర్వాత లండ‌న్ లోని ఖరీదైన హోటల్‌లో అనంత్-రాధికల వివాహాన్ని సెల‌బ్రేట్ చేయనున్నారనేది తాజా సంచ‌ల‌న‌ వార్త‌. ఈ భ‌వంతి ముఖేష్ అంబానీ, నీతా అంబానీకి చెందినదే. ఇది సొంత‌ భవనం, గోల్ఫ్ కోర్సులు, టెన్నిస్ కోర్ట్‌లతో కూడిన చారిత్రాత్మక 300 ఎకరాల ఎస్టేట్‌... అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 2021లో 57 మిలియన్ల పౌండ్ల‌కు కొనుగోలు చేసింది. కానీ ఆ త‌ర్వాత దీనిని ఒక క్రేజీ హోట‌ల్ గా ఖ‌రీదైన బాబుల విలాసాల విల్లాగా కంటిన్యూ అవుతోంది.

అందుకే ఇలాంటి భ‌వంతిని బ్లాక్ చేయ‌డం ద్వారా.. భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఏం చేసినా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని మరోసారి నిరూపించ‌బోతున్నారు. దానికి వేదిక‌ను సిద్ధం చేస్తున్నారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక స్టోక్ పార్క్ హోటల్‌ను రెండు నెలలకు బుక్ చేసుకోవడం ద్వారా అంబానీలు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. జూలై 12న ముంబైలో జరిగిన పెళ్లి తర్వాత అనంత్- రాధికా మర్చంట్ లు మ‌రోసారి ఘ‌న‌మైన‌ వివాహాన్ని జరుపుకోవడానికి విలాసవంతమైన బుకింగ్ ఇది అని విశ్లేషిస్తున్నారు.

ముకేశ్ -నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్, తన చిరకాల ప్రేమికురాలు అయిన రాధికా మర్చంట్‌తో పెళ్లిని ఇంత సంబ‌రంగా జరుపుకుంటాడ‌ని అత‌డు కూడా ఊహించి ఉండ‌డు. ఇప్ప‌టికే 500 మిలియన్ డాల‌ర్ల‌ ఖర్చుతో వివాహ సంబ‌రాలు ముగిసాయ‌ని అంతా భావించారు. కానీ ఇది మీడియాకి కూడా అంతుచిక్క‌ని వ్య‌వ‌హారంగా మారింది. ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలు ముగింపు అని భావించారు. కానీ ఇప్ప‌ట్లో ఈ వేడుక‌లు మాత్రం ముగిసేలా లేవు. ది సన్ మ్యాగ‌జైన్ వివ‌రాల‌ ప్రకారం లండన్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌లోని సెవెన్-స్టార్ స్టోక్ పార్క్ హోటల్‌లో వివాహానంతర వేడుకలు కొనసాగనున్నాయి.

సెప్టెంబరు వరకు హోటల్ మొత్తాన్ని బుక్ చేయాలని ముకేశ్ అంబానీ తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది. భవనం, గోల్ఫ్ కోర్సులు.. టెన్నిస్ కోర్ట్‌లతో కూడిన చారిత్రాత్మక 300 ఎకరాల ఎస్టేట్‌ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. పునర్నిర్మాణాల తరువాత ఎస్టేట్ ప్రజలు ప్ర‌వేశించ‌కుండా మూసివేసారు. కానీ అంబానీ కుటుంబం కోసం మాత్ర‌మే దీనిని తెరిచారు. దీంతో స్థానిక కౌన్సిల్ కమ్యూనిటీ సభ్యుల్లో ఉద్రిక్తత‌లు త‌లెత్తాయి.

ఇప్పుడు ఆ ఘర్షణను మ‌రింత పెంచేందుకా అన్న‌ట్టు.. ముఖేష్ అంబానీ వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా హోటల్‌ను బుక్ చేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 850 మంది గోల్ఫ్ క్లబ్ సభ్యులు క్లబ్‌కు దూరంగా ఉండాలని కోరారు. వేడుకలు ప్రిన్స్ హ్యారీ - మాజీ UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, అలాగే టోనీ.. చెరీ బ్లెయిర్‌ సహా ఉన్నత స్థాయి అతిథులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.

ది సన్ వివ‌రాలు నిజానికి భార‌తీయులు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు పెద్ద షాకిస్తున్నాయి. ``అంబానీలు రెండు నెలలపాటు పనులు చేయరు. వారి హోట‌ల్ లోకి బ‌య‌టి వారిని ప్ర‌వేశించ‌నీయ‌రు. మొత్తం వేదికను బుక్ చేయడం గురించి వారు ముందూ వెన‌కా ఏమీ ఆలోచించలేదు. వారికి ఈ ఖర్చు చాలా తక్కువ. వధూవరులు వారి కుటుంబంతో పాటు ఇందులో ర‌క‌రకాల‌ పార్టీలకు హాజరవుతారు. సెప్టెంబర్ లో ఈ వివాహానంత‌ర సంబ‌రాల్ని ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసారు.

పెళ్లి అనంత‌ర వేడుక‌లు అంటే అవి మామూలుగా కాదు. దీని కోసం వేల కోట్లు మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేయ‌బోతున్నార‌నేది ఒక విశ్లేష‌ణ‌. అతిథుల భద్రత, గోప్యత కోసం భద్రతను కఠినతరంగా మార్చార‌ని తెలిసింది. నిజానికి పెళ్లి త‌ర్వాత పెళ్లి నిజంగా ప్రత్యేకమైన ఈవెంట్‌గా ప్ర‌జ‌ల్లో కొన్ని సంవ‌త్స‌రాల పాటు చ‌ర్చించేదిగా మారుతుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహానంతర వేడుకలు వారి పెళ్లిని మించేలా గ్రాండ్‌గా నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా మరచిపోలేని విధంగా ఏర్పాటు చేసారు. దీని తర్వాత కూడా అంబానీలు ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది ఇప్ప‌టికి అంతు చిక్క‌ని ర‌హ‌స్యంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News