పాండే బ్యూటీ ఇంకా అలా ఫీలవ్వడం లేదు!
చుంకీ పాండే వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది
యంగ్ బ్యూటీ అనన్యా పాండే కెరీర్ జర్నీ గు రించి చెప్పాల్సిన పనిలేదు. చుంకీ పాండే వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. టాలీవుడ్ లో సైతం సత్తా చాటాలని `లైగర్` తో ప్రవేశిం చింది. కానీ ఫలితం నిరాశ పరిచింది. దీంతో అమ్మడు మళ్లీ తెలుగు వైపు చూడకుండా హిందీ సినిమాలపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. ఈ ఏడాది `కంట్రోల్`, `కాల్ మీ బే` చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది.
మొత్తంగా బాలీవుడ్ లో దాదాపు ఐదారేళ్లగా పనిచేస్తోంది. అయితే తనకి ఇంకా స్టార్ అనే ట్యాగ్ కి అనర్హురాలని వ్యాఖ్యానించింది. `18 ఏళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టాను. అప్పుడే ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాను. అయినా వెనకడుగు వేయకుండా పరిశ్రమలో కొనసాగాను. ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంద నిపిస్తుంది. ప్రేక్షకులు ఇప్పుడే నా పనితనాన్ని గుర్తిస్తున్నారు.
అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకప్పుడు ప్రముఖ నటుల్ని మాత్రమే స్టార్ అని పిలిచేవారు. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా స్టార్లు ఎక్కువయ్యారు. నేను స్టార్ గా ఉండాలనుకుంటున్నా. కానీ అందుకు ఇంకా సమయం పడుతుంది. అలాగని సోషల్ మీడియా స్టార్ అని పిలిపించుకోవడం ఇష్టం లేదు. స్టార్ అంటే అసలైన స్టార్ గా నే కనిపించాలి` అని అంది.
మొత్తానికి అనన్య స్టార్ అనే పదానికి అసలైన అర్దం తెలుసుకున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అందరూ స్టార్లే. ఏ భామ ఇన్ స్టా ఓ పెన్ చేసినా లక్షల్లో ఫాలోవర్లు ఉంటున్నారు. అయితే అక్కడ కంటెంట్ ని బట్టి వీక్షణ అన్నది ఆధారపడి ఉంటుంది. కంటెంట్ లేకపోతే? లక్ష మంది ఉన్నా? ఉపయోగం ఏమీ.