నటిపై కాన్ మాన్ కన్నేసాడు కానీ!
తాజాగా యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ అయ్యేది. జస్ట్ మిస్ అయిందంతే? వివరాల్లోకి వెళ్తే.. 'నాపేరుతో సిమ్ కార్దు తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారని నాకు ఫోన్ చేసింది.
కాన్ మాన్ సుకేష్ చంద్ర తరహా మోసాలెన్నో. వెలుగులోకి వచ్చేవి కొన్ని అయితే రానివి ఎన్నో ఉన్నాయి. డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు చెలరేగడంతో అంతు చిక్కని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఫోన్ మాట్లాడుతూనే డబ్బులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు పర్స్ కొట్టాలంటే కొట్టేయడానికి ముందు బోలెడంత రెక్కీ వేసేవాడు. ఇప్పుడు అలాంటిందేం లేదు? ఉన్న టెక్నాలజనీ దుర్వినియోగ పరుస్తూ బ్యాంక్ ఖాతాలో ఈజీగా చొరడుతున్నారు.
తాజాగా యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ అయ్యేది. జస్ట్ మిస్ అయిందంతే? వివరాల్లోకి వెళ్తే.. 'నాపేరుతో సిమ్ కార్దు తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారని నాకు ఫోన్ చేసింది. మీ నెంబర్ తో మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నారు. ముంబై ట్రాయ్ కార్యాలయం నుంచి మాట్లాడు తున్నాం. ఈ నెంబర్ పై దాదాపు 25 మనీలాండరింగ్ కేసులున్నాయి. మీకు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు.
కొద్ది సేపు వీడియో కాల్ ఆన్ చేసి ఆఫ్ చేసారు. దీనిపై మీరు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయండని వీడియో కాల్ ద్వారా నన్ను నమ్మించేందుకు కొన్ని డాక్యుమెంట్లు చూపించారు. ఆర్బీఐకి మనీ ట్రాన్సఫర్ చేయాలని అడిగారు. థర్డ్ పార్టీ నెంబర్ పంపి డబ్బు పంపమన్నారు. నాకు డౌట్ వచ్చి ప్రశ్నించాను. దీంతో నాపై తిరగబడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో ఫోన్ పెట్టేసాడు. రోజూ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.
అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డబ్బులు అనే కాన్సెప్ట్ కాల్ వచ్చిన ప్పుడు వాళ్లతో సుదీర్ఘంగా మాట్లాడి అన్ని విషయాలు వెరిఫై చేసుకోవాలి. వాళ్లతో బెదిరింపు ధోరణిలో మాట్లాడితే దెబ్బకి దారికి వస్తారు. ఇలాంటి వాళ్ల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి' అని సూచించారు.