బాలయ్య బ్యాడ్ టచ్ పాఠం.. అనసూయ డోంట్ కేర్​!

అనసూయ స్పందిస్తూ .. ఈ విషయం గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పలేం. బాలకృష్ణ సర్ చెప్పిన డైలాగ్స్​ను మరచిపోలేము.

Update: 2023-10-23 14:46 GMT

సాధారణంగా నందమూరి బాలకృష్ణ అంటే.. ఏవో పిచ్చి పిచ్చి స్పీచ్​లు ఇస్తూ.. ఎవరికీ తెలియని అర్థం కానీ పద్యాలు, వేదాంతాలు చెబుతూ ఉంటారని ఓ అభిప్రాయం ఉంది. దీనిపై చాలా సార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్​ కూడా వచ్చాయి. కాంట్రావర్సీకి కూడా దారీ తీశాయి. అయితే ఈసారి మాత్రం కథ మారింది.


దర్శకుడు అనిల్​ రావిపూడి తాజాగా తెరకెక్కించిన భగవంత్ కేసరితో బాలయ్య చెప్పిన పవర్​ఫుల్​ సోషల్​ మెసేజ్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. గుడ్​ టచ్​ బ్యాడ్ టచ్​ అనే సెన్సిటివ్​ అంశాన్ని బాలికలకు, అమ్మాయిలకు చక్కగా అర్థమయ్యేలా బాలయ్య అద్భుతంగా వివరించారు. ఆడపిల్లలను చైతన్య వంతులను చేసే విధంగా.. అమ్మాయిల శరీర భాగాలని ఎక్కడ టచ్ చేయాలి, ఎక్కడ టచ్​ చేయకూడదో చెబుతూ, అలా ఎవరైనా చేస్తే వెంటనే అమ్మకు చెప్పాలని ఓ స్కూల్ కార్యక్రమంలో బాలయ్య చెప్పిన సీన్​కు​ విశేష స్పందన దక్కింది.

దీంతో ఇప్పటివరకు గూడుకట్టుకున్న బాలయ్యపై నెగిటివిటీ కాస్త కనుమరుగైంది! బాలయ్య ఈ గుడ్ టచ్​ బ్యాడ్​ టచ్​ గురించి చెప్పిన పాఠం, ఆయన పవర్​ఫుల్​ ఎక్స్​ప్రెషన్స్​, వివరించిన విధానం.. ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. అందుకే ఇప్పుడు అందరూ బాలయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా కొనియాడుతున్నారు.

తాజాగా దీనిపై నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్య వంతులని చేయడం.. భగవంత్ కేసరి చిత్రం ద్వారా కేవలం వారంలోనే రీచ్ అయింది. మిగిలిన మాధ్యమాలకు అయితే పదేళ్లు పడుతుంది' అని రాహుల్ రవీంద్రన్ అన్నారు.

అనసూయ స్పందిస్తూ .. ఈ విషయం గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పలేం. బాలకృష్ణ సర్ చెప్పిన డైలాగ్స్​ను మరచిపోలేము. ఆ లైన్స్​ను నేను ఇన్​స్టా కోట్స్​లో వాడేస్తాను.. ఎందుకంటే.. ఐ(డోంట్) కేర్ బ్రో అంటూ అనిల్ రావిపూడికి టాగ్ చేసింది. మొత్తంగా ఈ సోషల్​ మెసేజ్​ బాలయ్యకు బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. బాలయ్య బాడీ లాంగ్వేజ్​ను వైవిధ్యంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు.

Tags:    

Similar News