అయ్యో కుర్ర హీరోయిన్స్ ని వేధిస్తున్న సమస్య..!

మలయాళ పరిశ్రమలో యువ హీరోయిన్స్ కు ఒక కొత్త సమస్య వచ్చి పడింది.

Update: 2024-07-25 12:30 GMT

మలయాళ పరిశ్రమలో యువ హీరోయిన్స్ కు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. టీనేజ్ లోనే కథానాయికగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న వాళ్లకు అనుకోని విధంగా సమస్యలు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా మలయాళంలో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అనస్వర రాజన్, మమితా బైజులకు హీరోల తో కలిసి నటించడానికి వారి మధ్య ఏజ్ గ్యాప్ ప్రాబ్లం అవతుంది. అదేంటి అది కూడా ఒక సమస్యేనా అనుకోవచ్చు.

టాలీవుడ్ లెక్క వేరు.. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. హీరో ఏజ్, హీరోయిన్ ఏజ్ ఇవేవి ఇక్కడ కాలిక్యులేట్ చేయరు. అలా చేస్తూ సినిమా చూడాలంటే కష్టమే కానీ మలయాళంలో కథలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ సినిమా కథలన్నీ మన చుట్టూ జరిగే కథల్లా అనిపిస్తాయి. ఐతే అలాంటి సినిమాల్లో నటించడం వల్ల అనస్వర, మమితాలకు జోడీలు వెతకడం కష్టమవుతుంది.

మలయాళంలో తన క్యూట్ లుక్స్ తో దానికి తగినట్టుగానే నటనతో మెప్పిస్తున్న అనస్వర రాజన్ ఈమధ్య చేసిన సినిమాలు చూస్తే అందులో హీరోల పక్కన ఆమె చాలా చిన్న పిల్లలా అనిపించింది. ఐతే అది తన సమస్య కాకపోయినా అలా జరుగుతుంది. మరోపక్క మమితా బైజు కూడా యువ హీరోలతో కలిసి నటిస్తే ఓకే కానీ మిడిల్ ఏజ్ హీరో అయితే చూసేందుకు అంత బాగా అనిపించట్లేదు.

మరి ఈ హీరోయిన్స్ కేవలం యువ హీరోయిన్స్ కే పరిమితం అవుతారా అంటే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వీరు స్టార్స్ తో నటించాలంటే మాత్రం కష్టమవుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువ అవ్వడం వల్ల తెర మీద ఎమోషన్స్ అంతగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. అందుకే వీరిని సాధ్యమైనంతవరకు యువ హీరోల సరసన తీసుకుంటున్నారు. ఎవరైనా క్రేజ్ వచ్చే కొద్దీ స్టార్ ఛాన్సులు అందుకుంటారు కానీ అనస్వర, మమితాలు మాత్రం యంగ్ హీరోలకే పర్మితం అవ్వాల్సి వస్తుంది. ప్రేమలు సినిమాతో మమితా బైజు సౌత్ అంతా పాపులర్ అయ్యింది. ఆమెతో పాటు అనస్వర రాజన్ సినిమాలు కొన్ని డబ్ అవ్వడం వల్ల అమ్మడికి తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరికి ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఐతే మమితా బైజుతో ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Tags:    

Similar News