యానిమల్ బాక్సాఫీస్.. ఆ కోరిక కష్టమే..

అయితే ఈ మూవీ 900 నుంచి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.

Update: 2023-12-22 08:12 GMT

రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ యానిమల్. ఈ సినిమా ఇప్పటి వరకు 800 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. బాలీవుడ్ లో ఈ ఏడాది అతి పెద్ద హిట్స్ మూవీస్ లో మూడో సినిమాగా యానిమల్ నిలిచింది. సందీప్ రెడ్డి వంగా విజన్, రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయాయి.

ఈ కారణంగానే సినిమాకి భారీగా కలెక్షన్స్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా 400 కోట్లకి పైగా ప్రాఫిట్ నిర్మాతలకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ 900 నుంచి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అయితే తాజాగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ హిందీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

తాజాగా డార్లింగ్ ప్రభాస్ సలార్ కూడా ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ఈ రెండు సినిమాలు ఇండియా మొత్తం థియేటర్స్ ని ఆక్యుపై చేసేశాయి. దీంతో యానిమల్ మూవీకి మేగ్జిమమ్ క్లోజింగ్ పడిపోయినట్లే. సలార్ సినిమా హవానే ఈ వారం రోజుల పాటు నడుస్తుంది.

అలాగే హిందీ బెల్ట్ లో డంకీ ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ రెండు నిలబడితే మాత్రం యానిమల్ సినిమాని థియేటర్స్ నుంచి పూర్తిగా తీసేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి యానిమల్ ప్రభంజనానికి సలార్ తో ఫుల్ స్టాప్ పడిందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ చేయబోయే స్పిరిట్ కి కథ సిద్ధం చేసుకోవడం పైన దృష్టి పెట్టారు.

ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మొత్తం సలార్ సినిమా కలెక్షన్స్ పైన ఫోకస్ చేయనుంది. ఈ సినిమా ఈ ఏడాదిలో వెయ్యి కోట్లు కలెక్షన్స్ అందుకునే చిత్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ గా నిలిచాయి. వీటిని సలార్ బీట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News