యూఎస్.. మరో రికార్డు బ్రేక్ చేసిన యానిమల్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి.. 25 రోజులు అవుతున్నా మంచి వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇప్పటికి రూ.850 కోట్లకుపైగా రాబట్టిన ఈ సినిమా రూ.900 కోట్ల మార్కుకు చేరువలో ఉంది.
తాజాాగా యానిమల్ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది.
ఫుల్ రన్ లో 14.32 మిలియన్ల డాలర్లను ఆర్ఆర్ఆర్ వసూలు చేయగా.. యానిమల్ ఇప్పటి వరకు 14.33 మిలియన్ల డాలర్లను రాబట్టింది. కేవలం 23 రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది ఈ మూవీ. మరి నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 భారతీయ చిత్రాలివే.
1. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ - 22 మిలియన్ డాలర్లు
2. పఠాన్ - 17.49 మిలియన్ డాలర్లు
3. జవాన్ - 15.23 మిలియన్ డాలర్లు
4. యానిమల్ - 14.33 మిలియన్ డాలర్లు
5. ఆర్ఆర్ఆర్ - 14.32 మిలియన్ డాలర్లు
6. దంగల్ - 12.19 మిలియన్ డాలర్లు
7. పద్మావత్ - 12.17 మిలియన్ డాలర్లు
8. PK - 10.62 మిలియన్ డాలర్లు
9. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ - 10.60 మిలియన్ డాలర్లు
10. బాహుబలి: ది బిగినింగ్ - 8.48 మిలియన్ డాలర్లు
కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్ లో సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఇదే. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో కలిసి సందీప్ అన్నయ్య ప్రణయ్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. రష్మిక, రణ్ బీర్ తోపాటు తృప్తి డిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1వ తేదీన రిలీజైన ఈ మూవీ రణ్ బీర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను తెరకెక్కించనున్నారు సందీప్. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందో మరి.