యానిమల్ కు ఆ రికార్డు కష్టమే

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది.

Update: 2023-12-11 04:03 GMT

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఏడువందల కోట్లకి పైగా యానిమల్ మూవీ కలెక్ట్ చేసింది. దీని తర్వాత ఇండియన్ ఇండస్ట్రీలో ఐదు వందల కోట్ల క్లబ్ దాటిన పదవ చిత్రంగా యానిమల్ నిలిచింది.

రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్, సరికొత్త కాన్సెప్ట్ హిందీ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. అందుకే హిందీ వెర్షన్ కి ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ ఇమేజ్, బలమైన కథ కారణంగా తెలుగులో యూత్ ఆడియన్స్ కి యానిమల్ మూవీ భాగా కనెక్ట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలిగే విధంగా మూవీ లేకపోవడం వలన తెలుగులో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

జవాన్ మూవీ తెలుగులో 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. యానిమల్ మూవీ ఈ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఆ స్థాయిలో మూవీ ప్రభావం చూపించడం లేదు. మంచి వసూళ్లు అయితే వస్తున్నాయి కాని జవాన్ కి అందుకునే ఛాన్స్ అయితే లేదు. ఇక తమిళ్, కన్నడ, మలయాళీ వెర్షన్స్ లో మూవీ ఆయా రాష్ట్రాల ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేదు.

ఆ ప్రభావం స్పష్టంగా వసూళ్ళపై కనిపిస్తోంది. మూవీ ఆరంభంలో జోరు చూస్తే కచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అయితే వారం రోజుల తర్వాత కలెక్షన్స్ డ్రాప్ కనిపిస్తోంది. ఆడియన్స్ స్పీడ్ కూడా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే లాంగ్ రన్ లో 950 కోట్ల వరకు యానిమల్ ఆగిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తెలుగు, హిందీ భాషలలో మాత్రమే యానిమల్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మిగిలిన భాషలలో డిజాస్టర్ అయినట్లే. నెల రోజులు వెయిట్ చేస్తే ఓటీటీ లోకి మూవీ వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేసేవారు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడకపోవచ్చు.

Tags:    

Similar News