యానిమల్ : ఎక్స్ లో ఏంట్రా పని, ఆపరా సోది...!
ఆ పోస్టర్ ను వాటర్ మార్క్ లేకుండా పోస్ట్ చేయాలంటూ ఒక నెటిజన్ కోరడం జరిగింది.
రణబీర్ కపూర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'యానిమల్'. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న యానిమల్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. సినిమా విడుదల అయ్యి మూడు వారాలు అవ్వబోతున్న కూడా సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ సభ్యుల సందడి కొనసాగుతూనే ఉంది.
యానిమల్ సినిమా అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో రెగ్యులర్ గా కలెక్షన్స్ కి సంబంధించిన విషయాలను, పోస్టర్ లను షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా 17 రోజుల్లో రూ. 835.9 కోట్లు అంటూ ఒక పోస్టర్ ను ఎక్స్ లో యానిమల్ సినిమా అధికారిక ఖాతా నుంచి షేర్ చేయడం జరిగింది.
ఆ పోస్టర్ లో హీరో రణబీర్ కపూర్ మరియు విలన్ బాబీ డియోల్ లు షర్ట్ లు లేకుండా, రక్తం కారుతున్న శరీరంతో కనిపిస్తున్నారు. ఆ పోస్టర్ ను వాటర్ మార్క్ లేకుండా పోస్ట్ చేయాలంటూ ఒక నెటిజన్ కోరడం జరిగింది. అందుకు యానిమల్ టీమ్ అఫిషియల్ అకౌంట్ లో ఆ పిక్ తో నీకు ఎంట్రా పని అంటూ ప్రశ్నించడం జరిగింది.
ఆ వెంటనే టీ సిరీస్ సౌత్ వారు ఆపరా నీ సోది అంటూ యానిమల్ అఫిషియల్ అకౌంట్ పై కామెంట్ చేస్తూ సదరు నెటిజన్ కోరినట్లుగా ఎక్స్ ద్వారా ఆ పోస్టర్ ను వాటర్ మార్క్ లేకుండా షేర్ చేయడం జరిగింది. అంతే కాకుండా నీవు హ్యాపీగా ఉండు మావ అంటూ సరదాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది.
మొత్తానికి అక్షిత్ అనే నెటిజన్ కి యానిమల్ మరియు టీ సిరీస్ సౌత్ ఎక్స్ అకౌంట్స్ మధ్య జరిగిన చర్చ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా ప్రమోషన్ లో ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తేనే జనాల్లోకి ఎక్కువగా సినిమా వెళ్తుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.