రెహమాన్ కు అనిరుధ్ డేంజర్ బెల్

కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు అనిరుద్. 3 మూవీతో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు

Update: 2023-10-03 13:30 GMT

కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు అనిరుద్. 3 మూవీతో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. ఆ సినిమాలో వై దిస్ కొలవేరి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు.

ఈ ఏడాది జైలర్ మూవీతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ మేజర్ క్రెడిట్ అనిరుద్ కి దక్కింది. బ్యాగ్రౌండ్ స్కోర్ వలన సినిమా పెద్ద హిట్ అయ్యిందనే టాక్ ఆడియన్స్ నుంచి వచ్చింది. ప్రస్తుతం అనిరుధ్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. తమిళంలో చేస్తూనే తెలుగులో కూడా పాన్ ఇండియా మూవీస్ కి అనిరుధ్ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం.

టాలీవుడ్ లో దేవర, VD 12 చిత్రాలకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే రజినీకాంత్ చేయబోయే నెక్స్ట్ రెండు సినిమాలకి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు. అందులో లోకేష్ కనగరాజ్ మూవీ ఒకటి కాగా జైభీమ్ దర్శకుడితో రజినీకాంత్ చేయనున్న మూవీ ఒకటి. అలాగే కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2కి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరోవైపు కోలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ఉన్నారు. మేగ్జిమం స్టార్ హీరోల చిత్రాలకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తూ ఉండేవారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అయితే జైలర్, జవాన్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అనిరుధ్ సొంతం చేసుకున్నారు. విజయ్, లోకేష్ లియో మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇలా సౌత్ లో పెద్ద ఇండస్ట్రీలైన కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్స్ కి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఛాయస్ అవుతున్నాడు. అయితే కోలీవుడ్ లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండటంతో తెలుగులో మాత్రం ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సెలక్టివ్ గా మూవీస్ చేస్తూ ఉండటం విశేషం. తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రెహమాన్ స్థానాన్ని అనిరుద్ ఆక్యుపై చేసేసాడనే మాట వినిపిస్తోంది. రెహమాన్ సినిమాలు సంఖ్య తగ్గించడం కూడా అనిరుధ్ కి అవకాశాలు పెరగడానికి ఒక కారణం అని చెప్పొచ్చు.

Tags:    

Similar News