కాస్త సౌండ్ పెంచాలి 'దేవర'
తాజాగా అనిరుద్ రవిచందర్ అయితే దేవర సాంగ్ వస్తుందని పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు. చిత్ర యూనిట్ అయితే ఇంకా అప్డేట్ ఇవ్వలేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయనని ఫ్యాన్స్ థియేటర్స్ లో చూసి రెండేళ్లు అయిపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోయే ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో దేవర మూవీ రెడీ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ సింగిల్ మాత్రమే రిలీజ్ అయ్యింది. అనిరుద్ రవిచందర్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. మూవీ రిలీజ్ కి గట్టిగా చూసుకుంటే రెండు నెలల సమయం కూడా లేదు. అయితే మూవీ టీమ్ మాత్రం దేవర సినిమా ప్రమోషన్స్ పై అగ్రెసివ్ గా వెళ్లడం లేదనే మాట వినిపిస్తోంది. ఫస్ట్ సింగిల్ తర్వాత ఇప్పటి వరకు మూవీ నుంచి కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో లీక్ అయిన కొన్ని ఫొటోస్ మాత్రమే వైరల్ అయ్యాయి.
ఫ్యాన్స్ దేవర మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ నుంచి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారంట. సెకండ్ సింగిల్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. తాజాగా అనిరుద్ రవిచందర్ అయితే దేవర సాంగ్ వస్తుందని పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు. చిత్ర యూనిట్ అయితే ఇంకా అప్డేట్ ఇవ్వలేదు.
ఈ రెండు నెలల కాలంలో సినిమాని ఎంత అగ్రెసివ్ గా జనాల్లోకి తీసుకొని వెళ్తే మూవీకి అంత హైప్ వస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అన్ని భాషలలో కూడా ఈ చిత్రాన్ని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయాలి. అక్కడి ఆడియన్స్ కి సినిమాపై అంచనాలు పెంచాలి. ఇప్పటికే మూవీపైన బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఎన్టీఆర్ కి కూడా సోలోగా పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకోవడానికి దేవర సక్సెస్ చాలా అవసరం. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా దేవర కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారనేది డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది.
అయితే చిత్ర యూనిట్ సైలెన్స్ పై తారక్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా దేవర అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ రిపీటెడ్ గా పోస్టులు పెడుతున్నారు. మరి కొరటాల శివ అండ్ కో దేవర సినిమా ప్రమోషన్స్ పై ఎలాంటి స్ట్రాటజీతో ముందుకి వెళ్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి 2898ఏడీ తరహాలోనే వెళ్దామంటే దేవరకి ఆ స్ట్రాటజీ వర్క్ అవుట్ కాకపోవచ్చనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.