కల్కి 2898 AD: మరో టాప్ రికార్డ్ బ్రేక్ అయ్యింది
కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సాలీడ్ కలెక్షన్లు అందుతున్నాయి.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన "కల్కి 2898 AD" విడుదలైన ముందు నుంచే రికార్డులు సృష్టిస్తోంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, వైజయంతి మూవీస్ నిర్మాణంలో, మూడు వారాల క్రితం విడుదలై సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ దగ్గర ఆదాయం పొందుతోంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సాలీడ్ కలెక్షన్లు అందుతున్నాయి.
తాజాగా, "కల్కి 2898 AD" టికెటింగ్ పోర్టల్ బుక్ మై షో (BMS) లో అత్యధిక టికెట్ అమ్మకాల రికార్డు సృష్టించింది. ఈ సినిమా, బుక్ మై షో ద్వారా 12.15 మిలియన్ టికెట్లను అమ్ముకొని, గత రికార్డు హోల్డర్ అయిన "జవాన్" (12.01 మిలియన్ టికెట్ సేల్స్) ను తక్కువ కాలంలోనే అధిగమించింది. ఈ సై-ఫై యాక్షన్ చిత్రం కేవలం 20 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం, నాలుగో వీకెండ్ లో మరింత వసూళ్లు రాబట్టాలని భావిస్తున్నారు. వర్క్ డేస్ లో కూడా ఈ సినిమా స్థిరంగా కొనసాగుతోంది. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్, బాక్సాఫీస్ పండితుల అంచనాల ప్రకారం, రీపీట్ వ్యాల్యూ ఉన్న చిత్రంగా బాక్సాఫీస్ వద్ద చాలా కాలం ఇలానే కొనసాగే అవకాశముంది.
కల్కి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు, సబ్జెక్ట్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే సినిమా కలెక్షన్లలో ఎలాంటి తగ్గుదల లేకుండా నిలబడుతోంది. ప్రతి రోజూ సినిమాకు క్రేజ్ పెరుగుతుండటంతో, ప్రభాస్ మరియు అమితాబ్ అభిమానులు ఈ చిత్రాన్ని మరింత ఎక్కువసార్లు చూస్తున్నారనేది స్పష్టమవుతోంది.
మొత్తానికి, "కల్కి 2898 AD" చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా, భారత సినిమా రంగంలోనే ఒక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను సృష్టించడం పక్కా. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ పై మరింత అంచనాలు పెరిగాయి. మూడు నెలల అనంతరం మళ్ళీ సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పనుల్లో మేకర్స్ బిజీ కానున్నారు. కేవలం ఒక 30 శాతం షూటింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.