దీపా(ల)వళి వెలుగుల్లో మెరుస్తున్న ముద్దుగుమ్మ..!
సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో ఫాలోవర్స్ ని డిస్టర్బ్ చేస్తున్న అనుపమ దీపావళి పండుగ రోజు పండుగ శోభ అంతా తన ఇంట్లోనే అన్నట్టుగా కనిపిస్తుంది.
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలుగు ఆడియన్స్ కు కూడా అభిమానం ఎక్కువే. అ ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు అక్కడ ప్రేమం సినిమా ఇక్కడ రీమేక్ కాగా అందులో కూడా అలరించింది. యువ హీరోల సరసన సినిమాలు చేస్తూ వచ్చిన అనుపమ స్టార్ ఛాన్స్ లను అందుకోవడంలో వెనకపడినా కెరీర్ కొనసాగిస్తుంది. తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం తన లుక్స్ అని భావించిన అమ్మడు స్లిం గా మారి అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే అనుపమని ఇదివరకు లుక్ నే ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. మేకోవర్ తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది అమ్మడు. లాస్ట్ ఇయర్ కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్ అందుకున్న అనుపమ త్వరలో ఈగల్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమాతో పాటుగా టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా నటిస్తుంది అనుపమ. బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్న అనుపమ ఆ సినిమాతో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకుంది.
సినిమాలతోనే కాదు తన ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ లేటెస్ట్ గా దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేసింది. శారీ లుక్ లో కర్లీ హెయిర్ తో అనుపమని అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపించేలా కవ్విస్తుంది. దీపావళి దీపాల వెలుగుల్లో అందాలను వెదజల్లుతూ తన ఫాలోవర్స్ హృదయాలను గాయం చేస్తుంది అనుపమ.
ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో ఫాలోవర్స్ ని డిస్టర్బ్ చేస్తున్న అనుపమ దీపావళి పండుగ రోజు పండుగ శోభ అంతా తన ఇంట్లోనే అన్నట్టుగా కనిపిస్తుంది. రవితేజతో చేస్తున్న ఈగల్, సిద్ధు తో చేస్తున్న టిల్లు స్క్వేర్ రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ పడితే మాత్రం అనుపమ మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుందని చెప్పొచ్చు.
తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఛాన్స్ లు అందుకుంటున్న అనుపమ ఏ అవకాశాన్ని వదలకుండా తన సత్తా చాటాలని చూస్తుంది. ఫ్యామిలీతో దీపావళి పండుగ జరుపుకున్న అనుపమ తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని తన వల్లో వేసుకుంటుంది. ప్రస్తుతం అనుపమ దీపావళి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కన్నడ లో ఒక సినిమానే చేసిన అనుపమ సౌత్ అంతా కవర్ చేస్తుంది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా సరే తన సత్తా చాటాలని చూస్తున్న అనుపమ కెరీర్ ఇదే రేంజ్ లో దూసుకెళ్లాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.