ఈసారి జూ.కోహ్లీనా? విరుష్క మరో శుభవార్త!
బాలీవుడ్ నటి అనుష్క శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తమ మొదటి బిడ్డ వామికను స్వాగతించిన రెండేళ్ల తర్వాత వారి రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తమ మొదటి బిడ్డ వామికను స్వాగతించిన రెండేళ్ల తర్వాత వారి రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాజా కథనాల ప్రకారం.. అనుష్క ఇప్పటికే రెండోమాసం బిడ్డను మోస్తోంది. ఆమె లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి కారణమిదేనని కూడా టాక్ వినిపిస్తోంది.
కోహ్లి టీమిండియా తరపున దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సక్సెస్ తో బిజీగా ఉండగా, స్టాండ్స్ నుండి తన భర్త అతడి టీమ్ ని ఉత్సాహపరుస్తూ తరచుగా స్టేడియంలలో జోష్ ని ప్రదర్శించే అనుష్క గత కొన్ని మ్యాచ్ ల నుంచి అదృశ్యమైంది. భారతదేశం వెలుపలి టోర్నమెంట్లను ఎన్నడూ మిస్ చేయని అనుష్క ఈసారి ఎందుకనో అన్నిటినీ వదులుకుంది.
హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకారం.. అనుష్క - విరాట్ కోహ్లీ ఇటీవల నగరంలోని ఒక ప్రసూతి క్లినిక్‌ని సందర్శించారు. కెమెరా కళ్లకు చిక్కకుండా దాచేయాలని చూసినా అది కుదరలేదు. అయితే వారు కెమెరామెన్లను ఈ వీడియో బయటికి పంపొద్దని కోరినట్టు తెలిసింది. అంతేకాదు.. తమ రెండో బిడ్డ గురించి త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారట.
కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత అనుష్క- కోహ్లీ డిసెంబర్ 2011 లో వివాహం చేసుకున్నారు. టుస్కానీలోని ఘనమైన పెళ్లికి పరిమితంగా అతిథులు విచ్చేశారు. బి-టౌన్ లోని ఖరీదైన వివాహాలలో ఇది ఒకటిగా నిలిచింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలోనే అనుష్క - కోహ్లి తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2021లో వారు ఆడబిడ్డకు గర్వించదగిన తల్లిదండ్రులు అయ్యారు. మొదటి బిడ్డకు వామిక అని పేరు పెట్టారు. అనుష్క - కోహ్లీ దంపతులు తమ గారాల కుమార్తె వామిక ముఖాన్ని ఇంకా రివీల్ చేయలేదు. వారు తమ కుమార్తె ఫోటోలను తీయొద్దని అనేక సందర్భాల్లో మీడియాను అభ్యర్థించారని కథనాలొచ్చాయి. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
అనుష్క తదుపరి ప్రాజెక్ట్‌లు
కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. అనుష్క తదుపరి `చక్దా ఎక్స్‌ప్రెస్` షూటింగ్‌ను ముగించింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చక్దా ఎక్స్‌ప్రెస్ కథాంశం ఆసక్తికరం. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన మహిళా పేసర్‌లలో ఒకరైన ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పేసర్ గోస్వామి టీమిండియా కోసం ఆడటం అనే తన ఏకైక కలను నెరవేర్చుకోవడానికి లెక్కలేనన్ని అడ్డంకులు కష్టాలను ఎదుర్కొంది. అయినప్పటికీ విజయాల నిచ్చెనను ఎలా అధిరోహించాలో సాధించి చూపింది. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన కథాంశం. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన చక్దా ఎక్స్‌ప్రెస్ ఐదు సంవత్సరాల విశ్రాంతి తర్వాత అనుష్క శర్మకు కంబ్యాక్ మూవీగా నిలవనుంది. తను నటించిన చివరి చిత్రం జీరో (2018) డిజాస్టరైన సంగతి తెలిసిందే. చక్ దా ఎక్స్ ప్రెస్ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానుంది. దీంతో అనుష్క డిజిటల్ ప్రపంచంలోను అరంగేట్రం చేస్తోంది.