అనుష్క బోల్డ్ డేర్.. సక్సెస్ ను అందిస్తుందా?

ఇక ఇది చూసిన సినీ ప్రియులు, అనుష్క అభిమానులు.. ఆమె పాత్రను చూసి నవ్వుకుంటూనే కాస్త షాక్ కు గురయ్యారు.

Update: 2023-08-25 03:00 GMT

తెలుగులో విజయశాంతి తర్వాత అలాంటి హీరోయిక్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క అనే చెప్పాలి. అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. .. తన బాక్సాఫీస్ స్టామినా ఎప్పుడో నిరూపించుకుంది. బాహుబలితో పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాతే ఆమె చేసిన భాగమతి, నిశబ్దం వంటి సినిమాలు నిరాశపరిచాయి.

దీంతో గత ఐదేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ తో రాబోతుంది. రిసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో ఆమె పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు మేకర్స్. ఇది చూస్తే ఆమె పెద్ద సాహసమే చేయబోతుందని అర్థమైంది. పెళ్లి అంటే పడని స్వతంత్ర భావాలున్న ఉన్న ఓ అమ్మాయి, తల్లి అవ్వడం కోసమే ఓ మగాడు సాయం అవసరమని చెబుతూ కనిపించింది.

ఈ క్రమంలోనే ఆమె కన్నా చిన్న వయసున్న నవీన్ పోలిశెట్టి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవడం, తప్పని సరి పరిస్థితుల్లో ఆమె అడిగిన కోరికను తీర్చడం కోసం పాట్లు పడటం వంటి సన్నివేశాలకు కాస్త కామెడీని జోడించి చూపించారు. ఇక ఇది చూసిన సినీ ప్రియులు, అనుష్క అభిమానులు.. ఆమె పాత్రను చూసి నవ్వుకుంటూనే కాస్త షాక్ కు గురయ్యారు.

అయితే ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు, పాత్రలు కొత్తేమి కాదు కానీ.. వాటిని చాలా వరకు ఆడియెన్స్ పెద్దగా ఆదరించరని తెలిసిన విషయమే. ఎందుకంటే విలువలకు విరుద్ధంగా మనోభావాలు దెబ్బతినేలా చూపిస్తే.. ఆడియెన్స్ వాటిని తిరస్కరించరాడనికి అస్సలు వెనకాడరు.

సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో డిబెట్ పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తారు. మరి అనుష్క చేయబోతే పాత్ర చూస్తుంటే.. తల్లి కావడానికి మాత్రమే మగాడు సాయం కావాలంటూ.. పెళ్లి అంటే అస్సలు పడడంటూ కనిపించింది.

ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం ఈ కాన్సెప్ట్ మీదే అనుష్క పాత్ర నడవనుందని పక్కాగా అర్థమవుతోంది. అసలే వరుస ఫ్లాప్ లతో చాలా కాలం పాటు దూరంగా ఉన్న అనుష్క ఇలాంటి బోల్డ్ పాత్రతో ముందుకు వస్తే ఆడియెన్స్ అంగీకరిస్తారా. అది కూడా అరుంధతి, రుద్రమదేవి, దేవసేన వంటి గొప్ప గొప్ప పాత్రలు పోషించిన అనుష్క.. ఇలాంటి తరహా పాత్రతో వస్తే ఆదరిస్తారా, అనుష్క ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనప్పటికీ ట్రైలర్ లో మొత్తంగా ఈ కాన్సెప్ట్ న మాత్రమే చూపించకుండా ఫన్నీ ఎలిమెంట్స్ ను కూడా బాగానే చూపించారు. మరి సినిమాలో కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎవరి మనోభావాలు దెబ్బకుండా చూపిస్తే ఓకే. లేదంటే విమర్శలు కూడా ఎదర్కోవాల్సి వస్తుంది. మరోవైపు ఇంకొంతమంది ఆమె అభిమానులు.. అనుష్క ఆచితూచి, ఆలోచించి మరి కథలో, తన పాత్రలో బోల్డ్ కంటెంట్ లేకుండానే, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా చూసుకునే.. ఈ సినిమాను ఎంచుకుని ఉంటుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News