అర్జున్ క‌పూర్-మ‌లైకా ప్ర‌యాణం ముగిసిందా!

ఈ నేప‌థ్యంలో మ‌లైకా ఆరోరా శనివారం ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. 'మార్పు అనేది జీవిత చట్టం

Update: 2023-08-26 12:30 GMT

బాలీవుడ్ జోడీ అర్జున్ క‌పూర్-మ‌లైకా ఆరోరా ప్రేమ ప్ర‌యాణం ముగిసిందా? ఇద్ద‌రి మ‌ధ్య క‌ల‌త‌ల‌తో దారులు దూరం పెరిగిందా? వివాహ బంధం వ‌ర‌కూ ఈ జంట చేరే అవ‌కాశం లేదా? అంటే లేద‌ని సంకేతాలు పాస్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ జంట మ‌ధ్య చిన్న పాటి క‌ల‌త‌లు మొద‌లైన‌ట్లు కొన్ని నెల‌లుగా ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్ల‌గా ఆమెకు దూరంగా ఉంటూ అర్జున్ క‌పూర్ ఖాతాలో కొత్త గాళ్ ప్రెండ్ చేరిన‌ట్లు వినిపిస్తోంది. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కుషా కపిలాతో డేటింగ్ చేస్తున్నాడని వార్త‌లొస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మ‌లైకా ఆరోరా శనివారం ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. 'మార్పు అనేది జీవిత చట్టం. గతం లేదా వర్తమానం వైపు మాత్రమే చూసేవారు భవిష్యత్తును కోల్పోతారు' అనే అర్థం వ‌చ్చేలా పోస్ట్ ఉంది. అలాగే నిన్న రాత్రి కూడా అలాంటి అర్థం వచ్చేటట్టు గా మ‌రో పోస్ట్ కూడా చేసింది. అందులో 'బలంగా ఉండండి. నిర్భయంగా ఉండండి. అందంగా ఉండండి.

మీకు మద్దతిచ్చే సరైన వ్యక్తులు పక్కన ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవు తుందని నమ్మండి' అని రాసుకొచ్చింది. ఇలా మ‌లైకా వ‌రుస పోస్టులు..అర్జున్ క‌పూర్ కొత్త గాళ్ల్ ప్రెండ్ .. ఈవిష‌యంలో క‌పూర్ బోయ్ సైలెంట్ గా ఉండ‌టం వంటి సంకేతాలు మ‌లైకాకి దూరం అయిన‌ట్లుగానే భావించాల్సి వ‌స్తోంది. వీట‌న్నింటికంటే ముందు మలైకా అరోరా - అర్జున్ కపూర్ చెల్లెళ్ళు అన్షులా, ఖుషి , జాన్వీ కపూర్‌లను సోష‌ల్ మీడియా ఖాతాల్లో అన్ ఫాలో చేసింది.

ఈ నేప‌థ్యంలో ఆ ఫ్యామిలీతో మ‌లైకాకి పోసొగ‌లేదా? అని బాలీవుడ్ మీడియా సందేహాలు వ్య‌క్తం చేసింది. ఏది ఏమైనా మ‌లైకా-అర్జున్ కపూర్ బంధంపై ఇప్పుడు బాలీవుడ్ లో వాడి వేడి చ‌ర్చ సాగుతోంది. ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డిన‌ప్పుడు ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారో తెలిసిందే. మ‌లైకా-అర్జున్ మ‌ధ్య భారీ వ‌య‌సు వ్య‌త్యాసం ఉన్న ప్రేమ‌కి వ‌య‌సు అడ్డంకి కాద‌ని నిరూపించిన జంట‌. వివాహ బంధంతో ధాంప‌త్య జీవితంలోకి అడుగుపెడ‌తార‌ని చాలా మంది భావించారు. ఇంత‌లో పిడుగు లాంటి గాసిప్ అభిమానుల్ని బాధిస్తోంది. ఇక కుషా కపిల ఈమధ్యనే తన భర్త జోరవర్ అహ్లువాలియా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News