డబ్బు కష్టాలే ఈరోజు ఇలా ఉండటానికి కారణం: AR రెహమాన్
ఆర్థిక స్వతంత్య్రం గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్థావించారు. అదే సందర్భంలో తాను యవ్వనంలో అనుభవించిన ఆర్థిక కష్టాల గురించి రెహమాన్ ముచ్చటించారు.
డబ్బు దుబారా గురించి పెద్దాళ్లు చాలా చెబుతుంటారు. కానీ పిల్లలు దానిని అర్థం చేసుకుని జాగ్రత్త వహిస్తేనే లైఫ్. సామాన్యుడు అయినా సెలబ్రిటీ అయినా దీనికి అతీతం కాదు. లెజెండరీ స్వరమాంత్రికుడు AR రెహమాన్ తన ముగ్గురు పిల్లలు - ఖతీజా, రహీమా, అమీన్ తెలివితేటలు ఆర్థిక స్వతంత్య్రం గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్థావించారు. అదే సందర్భంలో తాను యవ్వనంలో అనుభవించిన ఆర్థిక కష్టాల గురించి రెహమాన్ ముచ్చటించారు.
తన పిల్లల్లో ప్రతి ఒక్కరూ తనతో పాటు పని చేస్తూ వారి సంగీత వృత్తిని నిర్మించుకున్నారని... వాళ్లు తెలివిగా లేకుంటే వారసత్వంగా వచ్చినదంతా వృథా అవుతుందని రెహమాన్ అన్నారు. ఆర్థిక స్వేచ్ఛ దుర్వినియోగంపై మాట్లాడుతూ రెహమాన్ తన యవ్వనంలో అనుభవించిన ఆర్థిక కష్టాల గురించి చెప్పాడు. ఆ కష్టాలే తనను ఈరోజు ఇలా ఉండేలా చేశాయని.. డబ్బు వృధా అనే మాటల నుంచి తన పిల్లలను మినహాయించనని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను ఒక విషయం గురించి పిల్లలకు స్పష్టంగా చెప్పాను. ఎవరికైనా డబ్బు విదిలించినా.. పిల్లలు తెలివిగా లేకుంటే వారసత్వాన్ని అర్థం చేసుకోకపోతే అది ఒక రోజులో అదృశ్యమవుతుంది" అని చెప్పాడు. ఒక రోజు స్టూడియోగాను మారవచ్చు.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గోడౌన్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పినట్టు తెలిపారు.
నిజానికి మా అమ్మ సోదరీమణులు కుటుంబంతో చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కానీ ఆ పాఠాలు - మా అమ్మతో పాటు ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు నన్ను ఈ రోజు 'నేను'గా మార్చాయి. ఇప్పుడు కూడా ఆ అనుభవాలు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. కాబట్టి నా పిల్లలు ప్రతిదాని గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వారికి ప్రతిదీ తెలియాలి. వారి నుంచి ఎటువంటి చెడు వార్తలను లేదా సమస్యలను దాచాలని నేను అనుకోను. నేను కొనే భవనం కోసం రుణం పొందినట్లయితే నేను చెల్లించే ఈఎంఐ గురించి కూడా వారికి తెలియజేస్తాను. ఇది వారిని హింసించడానికి కాదు... వారిని నేర్చుకునేలా చేయడానికి మాత్రమే ఇలా చేస్తాను అన్నారు.
బంధుప్రీతి అంశాన్ని స్పృశిస్తూ.. నా వారసులు నన్ను సంగీతం విషయంలో ఫాలో అవ్వడం గురించి.. వారి లక్ష్యాల గురించి మాట్లాడాల్సి వస్తే.. ఈ రోజుల్లో ప్రజలు బంధుప్రీతి అనే కొత్త పదాన్ని నేర్చుకున్నారు.. అని అన్నారు. అంతేకాదు.. నేను నా స్టూడియోలో వస్తువులన్నింటినీ నిర్మించాను. నా ప్రపంచంలోకి పిల్లలు రాకపోతే ఈ ప్రదేశమంతా గోడౌన్‌గా మారిపోతుంది! నా స్టూడియోలోని ప్రతి అడుగు, ప్రతి అంగుళం, ప్రతి కుర్చీ చాలా అభిరుచి శ్రద్ధతో ఎంపిక చేసినవి. నేను వారి నుంచి చాలా ఆశిస్తున్నాను. భవిష్యత్తులో నా నుండి స్వాధీనం చేసుకోవడానికి నేను ఇచ్చేవి ఇవేనని భావిస్తాను.. అన్నారు.
తండ్రి చనిపోయినప్పుడు రెహమాన్ వయస్సు కేవలం తొమ్మిదేళ్లు. చిన్న వయస్సులోనే తన కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నాడు. రెహ్మాన్ దివంగత తల్లి కరీమా బేగం అతనిని పాఠశాల విద్యను మాన్పించాలనే కఠోర నిర్ణయం తీసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా చేస్తే రెహమాన్ తన సమయాన్ని సంగీతానికి కేటాయించవచ్చు. దీంతో కుటుంబ పోషణకు సరిపడా డబ్బు సంపాదించవచ్చు. ''మేం బ్రతకాలంటే అతడు సంపాదించాలి. అందువల్ల నేను సంగీతంలో కొనసాగమని చెప్పాను. పాఠశాల విద్యను ఆపేయమని కోరాను'' అని బేగం తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోంచి పుట్టుకొచ్చిన కసితోనే రెహమాన్ ఈరోజు ఈ స్థాయికి ఎదిగానని జాగ్రత్తగా ప్రతిదీ ప్రయత్నించానని వెల్లడించారు.