అంబానీ ఇంట పెళ్లిపై పాకిస్తాన్ నటుడి పైత్యం!
ఇక చివరి మూడు రోజులైన జులై 12, 13, 14 తేదీల్లో ముంబై ఏ రేంజ్ లో వెలిగిపోయిందో తెలిసిందే.
అంబానీ ఇంట పెళ్లి కోసం 5000 కోట్లకు పైగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అపర కుబేరుడు ముకేష్ అంబానీ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం గ్రాండ్ గా జరి పించారు. అంబానీ ఇంట పెళ్లికి ఐదు నెలల ముందుగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేష్స్ మొదలయ్యాయి. అలా పెళ్లి వరకూ నెలకో ఈవెంట్ చొప్పున చేసుకుంటూ వచ్చారు. జామ్ నగర్ లో ఒక ఈవెంట్ నిర్వహిస్తే.. రెండవ ఈవెంట్ ఇటలీలోని క్రూయిజ్ లో మరో ఈవెంట్ నిర్వహించారు.
ఇక చివరి మూడు రోజులైన జులై 12, 13, 14 తేదీల్లో ముంబై ఏ రేంజ్ లో వెలిగిపోయిందో తెలిసిందే. వచ్చిన అతిధులకు రెండు కోట్ల విలువైన వాచ్ లు సైతం అందించారు. హాలీవుడ్..బాలీవుడ్..టాలీవుడ్...కోలీవుడ్ ఇలా అన్ని ఉడ్ ల సెలబ్రిటీలు అంబానీ ఇంట డాన్సులేసి అదరగొట్టారు. ఇంకా అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అంతా హాజరయ్యారు. అయితే ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడంపై పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
`ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎన్నాళ్లు జరుపుకుంటున్నారో? కనీసం అంత కాలం కూడా బంధాలు నిలబడటం లేదు` అని రాసుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు చూసి నెటి జనులు మండిపడుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకుని ఇప్పుడే జీవితం మొదలు పెట్టారు? అప్పుడే మీ పైత్యం మొదలు పెట్టారా? అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంత్-రాధిక చిన్న నాటి స్నేహితులు. వారి ప్రేమలో నిజాయితీ ఉంది.
వారి బంధం తెగిపోయేంత బలహీనంగా కాదు. అయినా వాళ్లు సంపాదించిన డబ్బుతోనే వాళ్లకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకున్నారు. మధ్యలో నీకు నొప్పేంటి? నచ్చితే అశీర్వదించు ..లేకపోతే సైలెంట్ గా ఉండు. అంతేగానీ ఇలా ఇష్టారీతిన కామెంట్లు చేయోద్దని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.