చరణ్ కు 100 కోట్లు.. బుచ్చిబాబుకు అంతేనా?

Update: 2022-12-20 04:43 GMT
ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చిబాబు తదుపరి సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరపైకి రాబోతున్న సినిమా పై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. బుచ్చిబాబు మొదటి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లయినా కూడా ఇంకా తన రెండవ సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు.

మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తో స్టార్ట్ చేయాలని అనుకున్నాడు కానీ అతను వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం వల్ల బుచ్చిబాబుకు పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. దీంతో ఆలస్యం అవుతుంది అని దాదాపు అదే కథను రామ్ చరణ్ కోసం కొంత మార్పులు చేసిన బుచ్చిబాబు తన రెండవ సినిమాలు మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు.

అయితే ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ తేజ్ కు రెమ్యునరేషన్ దాదాపు 100 కోట్ల వరకు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. అయితే బుచ్చిబాబుకు మాత్రం పారితోషికం విషయంలో కొంత తక్కువగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నాన్ థియేట్రికల్ గానే ఈజీగా 150 కోట్ల వరకు బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.

ఇక థియేట్రికల్ గా మరొక 20 కోట్లు అనుకున్న కూడా మొత్తంగా సినిమా 350 కోట్ల వరకు బిజినెస్ చేయవచ్చు. అలాంటిది హీరోకు 100 కోట్లు ఇస్తున్నప్పుడు దర్శకుడికి తప్పకుండా 40 కోట్లు అయినా ఇవ్వాల్సిందే. కానీ నిర్మాతలు మాత్రం బుచ్చిబాబుకు 20 కోట్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

బుచ్చిబాబు కూడా ఈ విషయంలో పెద్దగా అభ్యంతరాలు తెలుపకుండా సినిమాకు ఎంత అవసరం అవుతుందో అంత ఖర్చు చేయాలి అని ముందుగానే మాట్లాడుకున్నట్లు సమాచారం. ఒక విధంగా బుచ్చిబాబుకి ఇది అతి పెద్ద సినిమా కాబట్టి నిర్మాతలు కూడా చాలా రిస్క్ చేస్తున్నారు. మరి సక్సెస్ అయిన తర్వాత అతనికి ఉప్పెన లాంటి గిఫ్టులు వస్తాయో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News