ఈ రోజుల్లో ఎంత మంచి సినిమా తీశామన్నది కాదు.. దాన్ని ఎంత బాగా ప్రమోట్ చేసి.. ఎంత ఎక్కువమంది జనాలకు చేరువ చేశాం అన్నది ముఖ్యం. అందుకే ప్రమోషన్ అన్నది చాలా కీలకంగా మారుతోంది ఈ రోజుల్లో. స్టార్ హీరోలు కూడా ఇంతకుముందులా మడికట్టుకుని కూర్చోకుండా విడుదలకు ముందు తర్వాత కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తున్నారు. ముందు మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నారు. ఆ తర్వాత సక్సెస్ మీట్లు పెట్టి, విజయయాత్రలు చేసి సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తున్నారు. ఐతే కంటెంట్ ఉంటేనే ఇవన్నీ వర్కవుట్ అవుతాయన్నదీ వాస్తవం అని గ్రహించాలి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు ఆ విషయంలో లోటేమీ లేకపోవడంతో.. దీనికి అదిరిపోయే రేంజిలో పబ్లిసిటీ చేస్తూ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు నిర్మాతలు.
గత శుక్రవారం మార్నింగ్ షోకు మంచి టాక్ రావడం మొదలు.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు అదిరిపోయే పబ్లిసిటీ చేస్తోంది 14 రీల్స్ సంస్థ. వీర హిట్ అంటూ ప్రచారం మొదలుపెట్టి.. రోజుకో ఆసక్తికరమైన టీజర్ కట్ చేస్తున్నారు. వేలంటైన్స్ డే రోజు కూడా వెరైటీ టీజర్ వదిలారు. నాని-రాజేష్... పృథ్వీ-మురళీ శర్మ.. నాని-మెహ్రీన్ కాంబినేషన్ లో వచ్చే ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన టీజర్లు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు సక్సెస్ మీట్లు, విహార యాత్రలు కూడా జోరుగా సాగుతున్నాయి. నిన్న హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటరుతో మొదలుపెట్టి.. నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పది నగరాల్లో విజయయాత్రలు చేస్తోంది ‘కృష్ణగాడి...’ టీమ్.