ప్రభాస్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య నిత్యం పొరపొచ్చాలే. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, అందులోనూ భీమవరంలో ఇది మరింత తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయి ఘటనలు గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభాస్ మూవీ బాహుబలి విడుదల సందర్భంగా వెస్టు గోదావరి పోలీసులు ముందే జాగ్రత్త పడ్డారు. ఇటు పవన్‌కల్యాణ్, అటు ప్రభాస్ అభిమాన సంఘాలను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని ఫ్యాన్స్‌కి సూచించారు. కాదని గొడవలకు దిగితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రెండేళ్ల కిందట వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం టౌన్‌లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు అభిమానులు. వీటిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే తగులబెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అంతటితో ఊరుకోని అభిమానులు అనుమానిత వ్యక్తుల ఇళ్లపై దాడులకు తెగబడడం, వాళ్ల ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనులతో అల్లర్లు సృష్టించారు.
దీంతో ఒక హీరో ప్లెక్సీలను మరో హీరో అభిమానులు తగుల బెట్టుకుంటూ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అభిమానుల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు రెండు కులాల వైరంగా మారిపోయింది. దీని ఫలితంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. మళ్లీ అలాంటి సీను రిపీట్ కాకుండా ఉండడానికి ఇప్పుడు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/