టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం "వారసుడు" సినిమాతో పాటుగా RC15 వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.
శంకర్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో ఉంటాయి. పాటలు మరియు ఫైట్ సీక్వెన్స్ ల కోసమే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. దర్శకుడితో సినిమా చేసే నిర్మాతలు ముందే వాటి కోసం సెపరేట్ బడ్జెట్ ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగుతుంటారు.
కానీ దిల్ రాజు ఎంత పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసినా బడ్జెట్ మాత్రం కంట్రోల్ లోనే ఉంటుంది. ప్రతీ రూపాయిని చాలా జాగ్రత్తగా కథకు అవసరం అనుకుంటేనే ఖర్చు చేస్తారని.. అనవసరపు హంగుల కోసం ఏమాత్రం ఖర్చు పెట్టరని ఇండస్ట్రీలో అంటుంటారు.
అలాంటిది ఇప్పుడు శంకర్ మరియు దిల్ రాజు కలిసి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. RC15 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినప్పుడే.. శంకర్ తో మూవీ అంటే అగ్ర నిర్మాత ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొట్టాయి.
అయితే RC15 అనేది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందే 50వ చిత్రం కావడం.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావటంతో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. తన గత చిత్రాల మాదిరిగా కాకుండా.. బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా.. శంకర్ స్టైల్ లోనే లావిష్ గా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట.
ఇందులో భాగంగా ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు వెయ్యి మంది ఫైటర్స్ పాల్గొనే ఓ హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ కోసం దాదాపు 10 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్ వచ్చింది.
ఈ క్రమంలో ఇప్పుడు RC15 లో మరో సాంగ్ కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. న్యూజిలాండ్ లో 12 రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరుగుతుందని.. నవంబర్ 20 నుండి డిసెంబర్ 2 వరకు ఈ షూట్ ప్లాన్ చేయబడిందని అంటున్నారు.
రామ్ చరణ్ మరియు హీరోయిన్ కియారా అద్వానీ లపై ఈ పాట చిత్రీకరించనున్నారు. కేవలం ఒక పాట కోసం 15 కోట్ల బడ్జెట్ అంటే నిజంగా చాలా పెద్దదని చెప్పాలి. సౌత్ ఇండియన్ సినిమాలోనే ఇది కాస్ట్లీ సాంగ్ గా పేర్కొనవచ్చు. అయితే సాంగ్స్ కోసమే అంతంత ఖర్చు చేయటానికి దిల్ రాజు సిద్ధపడటమే ఇప్పుడు ఇండస్ట్రీలో టాపిక్ అయింది.
శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న RC15 చిత్రాన్ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అనుకున్న విధంగా జరగకపోవడంతో.. ఆ ప్లేస్ లో వారసుడు చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
అందులోనూ శంకర్ సమాంతరంగా "ఇండియన్ 2" చిత్రాన్ని కూడా తీస్తుండటంతో RC15 ఆలస్యమవుతూ వస్తోంది. దీని కారణంగా ఎక్కువగా టైం పట్టడమే కాదు.. ముందుగా అనుకున్న బడ్జెట్ కూడా కాస్త పెరిగే అవకాశం వుంది. మరి దిల్ రాజు ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ ని ఎంతలో కంప్లీట్ అయ్యేలా చూస్తారో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.