ఒక వైపు బాలీవుడ్ లో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు భయపడుతున్నారు. కరోనాకు ముందు అక్కడ వారంలో రెండు మూడు పెద్ద చిన్న సినిమాలు వచ్చేవి. అంతకు మించి కూడా సినిమాలు అక్కడ విడుదల అయ్యేవి. కానీ ఇప్పుడు నెలలో రెండు మూడు సినిమాలు కూడా వస్తున్నట్లుగా అనిపించలేదు.
అక్కడ పరిస్థితి అలా ఉంటే ఇతర భాషల్లో పరిస్థితి కూడా కాస్త అటు ఇటుగా అలాగే ఉంది. కానీ తెలుగు బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమాల జాతర కొనసాగుతోంది. మొన్న శుక్రవారం పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అయ్యాయి. వాటిల్లో ఎక్కువ శాతం బొక్క బోర్లా పడ్డా కూడా ఈ వారం సినిమాల జాతర కొనసాగుతోంది.
ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాల సంఖ్య ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల సంఖ్య టాలీవుడ్ చరిత్రలో నిలిచి పోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
నాలుగు కాదు ఐదు కాదు ఏకంగా 15 నుండి 17 సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. దాదాపు అన్ని సినిమాలు కూడా చిన్న బడ్జెట్ సినిమాలు. కొన్ని మరీ లో బడ్జెట్ సినిమాలు కాగా మరి కొన్ని డబ్బింగ్ సినిమాలు. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో తమన్నా.. సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమాకు మాత్రమే కాస్త బజ్ క్రియేట్ అయ్యింది.
అది కాకుండా మరికొన్ని సినిమాలు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అంతకు మించి ఇతర సినిమాలు పెద్దగా అంచనాలు కలిగి లేవు. ఈ స్థాయిలో సినిమాలు విడుదల అయితే థియేటర్ల పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు. అసలు ఇన్ని సినిమాలకు థియేటర్ల షేరింగ్ ఎలా అనేది అంతు పట్టడం లేదు.
డిసెంబర్ తర్వాత జనవరి లో పెద్ద సినిమాల జోరు మొదలు అయితే వచ్చే ఏడాది సమ్మర్ పూర్తి అయ్యే వరకు పెద్ద సినిమాల జాతర కంటిన్యూ అవ్వబోతుంది. అందుకే తమ వద్ద ఉన్న సినిమాలను ఈ డిసెంబర్ లోనే దులిపేసుకుందామని.. వదిలేసుకుందామని భావిస్తున్నట్లుగా నిర్మాతలు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ఒకే వారం లో సినిమాలు విడుదల కాకపోవచ్చు. కనుక ఈ వారం చరిత్రలో నిలిచి పోయే వారం అవుతుంది అంటున్నారు. మరి ఇన్ని సినిమాల్లో కనీసం రెండు మూడు అయినా పాజిటివ్ టాక్ ను దక్కించుకుని గౌరవ ప్రధమైన కలెక్షన్స్ ను రాబడుతుందేమో చూడాలి.