బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరో ప్రభాస్ అని చెప్పాలి. ప్రభాస్ మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఈ స్థాయిలో హీరో అవుతాడని అనుకున్నాడో లేదో తెలియదు గాని మొత్తానికి బాక్స్ ఆఫీస్ రారాజు అనిపించుకున్నాడు. కెరీర్ ని మలుపు తిప్పడానికి ఒకే ఒక్క సినిమా చాలు అన్నది ఇండస్ట్రీలో హీరోల నమ్మకం. ప్రభాస్ కెరీర్ లో ఛత్రపతి కూడా అలాంటి సినిమానే..
ఇక అసలు విషయానికి వస్తే రెబల్ స్టార్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికీ సరిగ్గా 15 ఏళ్లు కావొస్తోంది. మొదటి సినిమా ఈశ్వర్ ను జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో చేశాడు ప్రభాస్. 2002 నవంబర్ 11న ఆ సినిమా రిలిజ్ అయ్యి ప్రభాస్ కి నటన పరంగా మంచి గుర్తింపును ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేశాడు. ఎన్ని సినిమాలను చేస్తోన్న ప్రభాస్ కి ఎదో పూర్తిగా సంతృపి చెందలేదు.. కానీ ఎప్పుడైతే ఛత్రపతి తో హిట్ అందుకున్నాడో స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఇక బాహుబలి తర్వాత మన టాలీవుడ్ హీరో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పటివరకు ప్రభాస్ 18 సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం 19వ చిత్రం సాహో ముస్తాబవుతోంది. ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతోన్న సందర్బంగా బాహుబలి నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా విషెష్ ని అందించారు. 15 సంవత్సరాల కింగ్ ప్రభాస్ కి శుభాకాంక్షలు.. ని కెరీర్ లో ఇంకా ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాం.. నీ రాబోయే ప్రాజెక్టులకు మా బెస్ట్ విషెస్ అంటూ ఆర్కా మీడియా వర్క్స్ వారు ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు కూడా ప్రభాస్ కి విషెస్ తెలిపారు.