మా ఎన్నికల ప్రచారం మాంచి రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమవ్వడంతో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ఒకరిపై మరొకరు విమర్శల వేడి కూడా పెంచుకుంటూ వెళుతున్నారు. మా ఎన్నికల వార్‌లో రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. ఈ రోజు బండ్ల గణేష్ అందరికి షాక్ ఇస్తూ తాను మా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని.. ప్రకాష్‌రాజ్‌కు సపోర్ట్ చేస్తున్నానంటూ ప్రకటన చేశారు. ఇక నిన్న ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రకాష్‌రాజ్‌పై సెటైర్లు వేశారు. దీనికి ఈ రోజు ప్రకాష్‌రాజ్ కౌంటర్ ఇచ్చేశారు.
విష్ణు తనను ఉద్దేశించి మీరు ప్రకాష్‌రాజ్ వైపు ఉన్నారా ? ఇండస్ట్రీ వైపు ఉన్నారా ? అని తనను ప్రశ్నించడం ఎంత మాత్రం బాగోలేదన్నారు. పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా ? అని ప్రశ్నించిన ఆయన తాను తెలుగువాడిని కాదని.. కర్నాటకలో పుట్టి ఏపీ, తెలంగాణలో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నానని చెప్పారు. తనకు 9 నంది అవార్డులు వచ్చాయని.. అవతల ప్యానెల్లో ఉన్న ఏ నటుడికి అయినా ఇన్ని అవార్డులు వచ్చాయా ? అని చాలెంజ్ విసిరారు.
తాను తెలుగు భాషపై చర్చకు సిద్ధమే అని.. తెలుగులో అలంకారాలు, చందస్సు, వ్యాకరణం దేని గురించి అయినా మాట్లాడతానని.. ఆత్రేయ, చలం, తిలక్ ఇలా ఎవరి గురించి చర్చ పెట్టినా మాట్లాడతానని కుండబద్దలు కొట్టారు. తెలుగు భాష మాట్లాడినంత మాత్రానా తెలుగు వారు అయిపోరన్నారు. పవన్ ఇండస్ట్రీ వ్యక్తా ? కాదా అని.. ముందుగా ఆయన ఇండస్ట్రీ వ్యక్తి అని.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడు అని ప్రకాష్‌రాజ్ తేల్చిచెప్పారు. పవన్ సినిమా మార్నింగ్ షో కలెక్షన్ అంత మీ సినిమా బడ్జెట్ ఉండదంటూ ఎద్దేవా చేశారు.
పవన్ ఇండస్ట్రీ గురించే కొన్ని ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగారని.. అవి కరెక్టా కాదా ? అనే మనం చర్చించుకోవాలని రాజ్ చెప్పారు. మీరు పవన్ వైపా.. ఇండస్ట్రీ వైపా ? అని తనను అనవసరంగా ఈ వివాదంలోకి ఎందుకు ? లాగుతారని.. మాట్లాడేటప్పుడు విష్ణు నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉద్యమం చేసి.. జగన్ పాదయాత్ర చేసి సీఎంలు అయ్యారని.. వారిని కూడా ఈ ఎన్నికల్లోకి ఎందుకు లాగుతున్నావంటూ విష్ణును ప్రశ్నించారు. ఏదేమైనా మా ఎన్నికలు చివరకు అనేక రంగులు పులుముకున్నాయి. మరి ఈ వార్‌లో ఎవరు అంతిమంగా పైచేయి సాధిస్తారన్నది ఉత్కంఠగానే ఉంది. ఇదిలా ఉంటే ప్రకాష్‌రాజ్‌కు ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు సంఘీభావం తెలపడంతో పాటు తమ మద్దతు తెలిపారు.