తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్నినాళ్లు చెప్పుకునేలా బాహుబలి సినిమాను తీసి చరిత్రలో నిలిచిపోయారు నిర్మాతలు శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రెండేళ్లలో పూర్తిచేద్దామని ప్లాన్ చేశారట. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్కే ఏడాది పట్టింది. ఆ తర్వాత సినిమాను మొదలుపెట్టి .. పెద్దది కావడంతో రెండు భాగాలుగా విభజించారు. బాహుబలి1ను రెండేళ్లపాటు తీసి రిలీజ్ చేశారు. ఇక రెండో భాగాన్ని మరో రెండేళ్లకు రిలీజ్ చేశారు. సంవత్సరాల తరబడి బాహుబలి పనుల్లోనే మునిగిపోయి ఈ మధ్యే ‘బాహుబలి’ ఛాయల నుంచి బయటపడ్డారు.
అయితే బాహుబలికి వాళ్లు పూర్తిగా దూరం కాలేకపోతున్నారు. ప్రస్తుతం బాహుబలి స్టైల్లో ‘స్వర్ణఖడ్గం’ పేరుతో ఓ సీరియల్ చేస్తున్నారు. ఇటీవలే ఈటీవీలో అది ప్రసారమైంది. మరోవైపు బాహుబలిపై పూర్తి నమ్మకంగా ఉన్న ప్రఖ్యాత డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ‘బాహుబలి’ నిర్మాతలతో కలిసి ఒక వెబ్ సిరీస్ తీసుకొస్తోంది.
మూడు భాగాలుగా తీసే ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 350 కోట్లు పెట్టడానికి నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చిందట.. ఈ బాహుబలి ప్రీక్వెల్ కోసం ఒక భాగానికి ‘ప్రస్థానం’ ఫేం దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నాడట.. ఇక రెండో దానికి మరో తెలుగు దర్శకుడు - మూడో భాగానికి హిందీ దర్శకుడికి బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి పర్యవేక్షణలో సాగుతుందని సమాచారం..
అయితే ఓ వెబ్ సిరీస్ కోసం 350 కోట్లు పెట్టుబడి పెట్టడం చూసి అందరూ అశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ లో ఇలా భారీ బడ్జెట్ లో ‘గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్ తీసి మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు బాహుబలి వెబ్ సిరీస్ మార్కెట్ ను మారుస్తుందో లేదో చూడాలి మరి..