వామ్మో.. ఒక్క సినిమాలో 365 సీన్లా?

Update: 2016-12-10 13:37 GMT
మామూలుగా ఒక సినిమాలో స‌గ‌టున 80 సన్నివేశాల దాకా ఉంటాయి. కొంద‌రు ఇంకో ప‌ది స‌న్నివేశాలు త‌గ్గిస్తారు. ఇంకొంద‌రు ఓ ప‌ది పెంచుతారు. స్క్రీప్టు రాసేట‌పుడే ఇలా స‌న్నివేశాలు లెక్క‌బెట్టుకుని ప‌ని చేస్తారు. కొంచెం పెద్ద సినిమాలైతే వంద స‌న్నివేశాలు దాటిన సంద‌ర్భాలు కూడా ఉండొచ్చు. కానీ ఒక సినిమాలో 365 సీన్లు ఉండ‌టం ఇప్ప‌టిదాకా ఎవ‌రూ చూడ‌లేదు. విన‌లేదు. అన్నేసి స‌న్నివేశాల‌తో సినిమా తీస్తే ఏడెనిమిది గంట‌లైనా నిడివి అవుతుంది. ఐతే ‘సింగం సిరీస్ లో వ‌స్తున్న మూడో సినిమా ‘ఎస్‌-3’లో రెగుల‌ర్ సినిమాల నిడివిలోనే ఇన్ని స‌న్నివేశాలూ ప‌ట్టించేస్తున్నార‌ట‌.

మామూలుగా హ‌రి సినిమాలంటే జెట్ స్పీడుతో ఉంటాయి. ప్ర‌తి స‌న్నివేశం ప‌రుగులు పెడుతుంటుంది. కెమెరా ఎక్క‌డా ఒక చోట ఆగ‌దు.  ఒక లొకేష‌న్ నుంచి ఇంకో లొకేష‌న్ కు.. ఒక స‌న్నివేశం నుంచి ఇంకో స‌న్నివేశానికి షార్ప్ గా వెళ్లిపోయాలా ఎడిటింగ్ చేయిస్తాడు హ‌రి. ఐతే ఎంత వేగం చూపించినా.. ఎలా ఎడిట్ చేసినా 365 సీన్ల‌ను ఒక్క సినిమాలో ప‌ట్టించ‌డం.. రెగుల‌ర్ ర‌న్ టైం తీసుకురావ‌డం అంటే ఊహ‌కంద‌ని విష‌య‌మే. మ‌రి హ‌రి ‘ఎస్‌-3’ కోసం ఏం మ్యాజిక్ చేశాడో చూడాలి. ఈ నెల 23నే త‌మిళ‌.. తెలుగు భాష‌ల్లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుదల కాబోతోంది ‘ఎస్‌-3’. సూర్య స‌ర‌స‌న శ్రుతి హాస‌న్.. అనుష్క ఇందులో క‌థానాయిక‌లుగా నటించారు.
Tags:    

Similar News