సైగ‌ల భాష కోసం స్టార్ హీరో పోరాటం!

Update: 2022-11-15 12:33 GMT
1983 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో క‌బీర్ ఖాన్ తెరకెక్కించిన '83' భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై ఎలాంటి ఫ‌లితాలు సాధాఇంచిందో తెలిసిందే. క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన సినిమా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కించారు.

స‌రిగ్గా అదే  స్ర్టాట‌జీతోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ 200 కోట్ల‌ రూపాయ‌ల ఖర్చుతో తెర‌కెక్కించిన సినిమా రిలీజ్ త‌ర్వాత ఆ స్థాయి వ‌సూళ్ల‌ను సాధించ‌డంలో మాత్రం విఫ‌ల‌య‌త్న‌మే క‌నిపించింది.

అతి క‌ష్టం మీద సినిమా పెట్టుబ‌డి తేవాల్సిన ప‌రిస్థితి.  అయితే కంటెంట్ ప‌రంగా ఎలాంటి వైఫ‌ల్యం లేన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం అంచ‌నాలు త‌ప్పాయి. కానీ ఇలాంటి సినిమాలు చూడాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని చాటి చెప్పింది. యువ‌త‌కి ఇలాంటి సినిమాలు ఆద‌ర్శంగా నిలుస్తాయ‌ని నిరూపించారు. తాజాగా ఈ చిత్రాన్ని మూగ‌వాళ్ల కోసం సైగ‌ల భాష‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి రెడీ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ర‌ణ‌వీర్ సింగ్  ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ ని భాత‌ర 23వ భాష‌గా గుర్తించాల‌ని కోరారు. వైక‌ల్యం కార‌ణంగా వె నుక బాటుకు గురైనా..మూగ‌..చెవిటి వాళ్ల‌కు స‌మాజంలో స‌మాన అవ‌కాశాలు ద‌క్కాల‌ని  కోరుకుంటున్నా. వాటి కోసం నిరంత‌రం పాటుప‌డ‌తా. అధికార  భాష‌గా గుర్తించాల‌ని వాళ్లు మొద‌లు పెట్టిన పిటీష‌న్ పై  సంత‌కం పెట్టా.

మ‌న‌దేశం ప్ర‌పంచంలో అత్యుత్త‌మ ప్ర‌దేశంగా చెప్పుకోవాలంటే స‌మాజ‌మంతా ఒక‌టి కావాలి. అంద‌ర్ని స‌మానంగా చూసే గొప్ప హృద‌యాలన్ని  ముందుకు రావాలి. వాళ్ల‌కు మ‌ద్ద‌తుగా రావాలి' అని చె ప్పుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో బాలీవుడ్ సెల‌బ్రిలం తా  ఎంతో ప్రోత్స‌హించారు. సెల‌బ్రిటీకు ప్ర‌త్యేక షో కూడా ఏర్పాటు చేసారు.

వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకోవ‌డం జ‌రిగింది. బాలీవుడ్ లో స్పోర్స్డ్ నేప‌థ్య‌మున్న సినిమాల‌కు మంచి స‌క్సెస్ రేటు ఉంది. కొన్నాళ్ల పాటు బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డిస్తే...మ‌రి కొన్నాళ్ల పాటు స్పోర్స్ట్  ట్రెండ్ న‌డుస్తుంది. ఆ వేవ్ లోనే 83 కూడా తెర‌కెక్కింది. ఇందులో మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో దీపికా ప‌దుకొణే న‌టించిన సంగ‌తి తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News