నా బ్రా కారణంగా ప్రాబ్లమ్‌ ఉంటుందా?

Update: 2016-06-10 09:30 GMT
ఒక గదిలో ఒకమ్మాయి బ్రా మంచం మీద కనిపించింది. దానిని ఒకబ్బాయి చూస్తాడేమోనని.. వెంటనే ఆ అమ్మాయి ఆ బ్రా తీసి దాచేసింది. అయితే ఈ సీన్‌ వెండితెరపై చూపించాలంటే.. మీరు ఆ 'బ్రా'ను బ్లర్‌ చేయాల్సిందే అంటూ ఆదేశాలిచ్చింది సెన్సార్ బోర్డు. ఇదంతా నిజంగా జరిగిన సీనేనండోయ్‌.

''క్వీన్‌'' సినిమా కోసం ఈ సీన్‌ కన్సీవ్‌ చేశాడు దర్శకుడు వికాస్‌ బాల్. స్వయంగా కంగనా రనౌత్‌ ఈ సీన్ లో నటించింది. సినిమాలో సీన్ సూపర్ హిట్టు. కాని ఈ సీన్‌ చూస్తే అక్కడ బ్రా ను డిజిటల్‌ గా బ్లర్‌ చేయడం మనం చూడొచ్చు. ''ఆ సీన్లో అసలు బ్రా బ్లర్‌ చేయడమేంటండీ? దాని వలన జనాలకు ఏమన్నా నష్టం ఉందా? నా బ్రా చూస్తే ఇప్పుడు జనాలు పాడైపోతారా? అసలు సెన్సార్ బోర్డు వారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కంగన. ప్రస్తుతం ''ఉడ్తా పంజాబ్'' సినిమాపై జరుగుతున్న రచ్చ గురించి రెస్పాండ్‌ అవ్వమంటే అమ్మడు అలా సెలవిచ్చిందిలే.

ఇకపోతే అసలు ''ఉడ్తా పంజాబ్‌''లో పంజాబ్‌ ఒక్కటే తీసేయమన్నాం.. మిగిలినవన్నీ మామూలు కట్లే అంటున్నారు బోర్డు చీఫ్‌ పంకజ్‌ నిహ్లానీ. ప్రస్తుతం ఇదే విషయంపై నిర్మాతల్లో ఒకరైన అనురాగ్‌ కశ్యప్ బోంబే హై కోర్టులో పిటీషన్‌ ఫైల్‌ చేశాడు.
Tags:    

Similar News