అప్పుకి చివ‌రి చిత్రంతో ఘ‌న‌మైన నివాళి!

Update: 2022-07-20 01:30 GMT
క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ హీరోగా క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ని ఏలిన న‌టుడు. రాజ్ కుమార్  వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన పునిత్ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగారు. ఎన్నో సినిమాల్లో న‌టించి తండ్రికి త‌గ్గ  త‌నయుడు అనిపించారు. కానీ కాలం ఆయ‌న్ని కాటేసింది.

గుండె పోటుతో  ఆకాశానికి ఎగ‌సిన ఆ ధృవ‌తార అభిమానుల గుండెల్లో ఎప్ప‌టికీ చిరంజీవుడే. క‌న్న‌డ‌లో ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కోట్లాది మంది అభిమానులున్నారు.

పునిత్  ఎంతో మంది అభిమానులకు సహాయం చేసారు. స‌హాయం అనేది ఆయ‌న దృష్టిలో చాలా చిన్న మాట‌. మ‌రెంతో మంది పిల్ల‌ల్ని సొంత డ‌బ్బుతో చ‌దివించారు. సామాజిక కార్య‌క్రమాల్లో  భాగంగా చారిటీలు ఏర్పాటు చేసి   రియ‌ల్ హీరోగా నిలిచారు.

ఇక న‌టుడిగా పునిత్ చివ‌రి సినిమా`గంధ‌ద గుడి` తో ఘ‌న‌మైన నివాళి అర్పించాల‌ని కుటుంబం స‌హా అభిమానులు భావిస్తున్నారు.  పునిత్ మొద‌టి వ‌ర్ధంతికి ముందు  రోజు చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ విష‌యాన్ని పునీత్ స‌తీమ‌ణి  అశ్వినీ తెలిపారు. ఈసినిమాకి ఆమె నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ``అప్పు చివ‌రి చిత్ర‌మిది.

వైవిథ్య‌మైన క‌థ‌..క‌థ‌నాల‌తో తెర‌కెక్కింది. అప్పుకి ఎంతో ఇష్ట‌మైన క‌ర్ణాట‌క అడ‌వుల్లోనే చాలా భాగం షూటింగ్ చేసాం. ఈ చిత్రాన్ని అప్పుకి ఇస్తున్న చివ‌రి  కానుక‌గా భావిస్తున్నాం. అక్టోబ‌ర్ 28న చిత్రాన్ని నేరుగా థియేట‌ర్లో రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ చిత్రా నికి అమోఘ‌వ‌ర్ష ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అజ‌నీష్ లోక్ నాధ్  సంగీతం అందిస్తున్నారు.

ఈ  నేప‌థ్యంలో సినిమాని విజ‌యం చేయాల్సిన  బాధ్య‌త‌ అభిమానులు  నెత్తిన వేసుకున్న‌ట్లు స‌మాచారం. సొంత డ‌బ్బుతో  సినిమా రిలీజ్ కి ముందు  పెద్ద ఎత్తున రాష్ర్ట వ్యాప్తంగా  ప్ర‌చారం చేయాల‌ని భావిస్తున్నారుట‌. దీనిలో భాగంగా అభిమాన సంఘాలు రంగంలోకి దిగ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ ర‌కంగా  పునిత్ కి అభిమానులు ఘ‌న‌మైన నివాళీ అందిస్తున్నారు.
Tags:    

Similar News