టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోకాలంగా హీరోగా నిలదొక్కుకోవాలని చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారు. పదేళ్లు దాటినా ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కెరీర్ ప్రారంభంలో హిట్టు కొట్టినప్పటికి ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలే ఖాతాలో పడితే సగటు మనిషి ప్రయత్నాలు కూడా మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీతో తరతరాల సంబంధం ఉండేసరికి ఇంకా అవకాశాలకు కొదవలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు యువహీరో ఆది సాయికుమార్. ఇండస్ట్రీలోకి సాయికుమార్ తనయుడుగా 2011లో ప్రేమకావాలి సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవ్వడంతో ఎంట్రీ బాగానే జరిగిందని అనుకున్నారు.
అందుకు తగ్గట్టుగానే రెండో సినిమా లవ్లీ కూడా బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. మరి ఆదికి ఇంకా తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ అసలు దశ ఇక్కడ నుండే ప్రారంభం అయింది. ప్రేమకావాలి, లవ్లీ సినిమాల తర్వాత ఇన్నేళ్లలో ఒక్క హిట్టు కూడా రాలేదు. దాదాపు 11 సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. తాజాగా శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆది. సిద్ శ్రీరామ్ ఆలపించిన 'ఒకే ఒక లోకం నువ్వే' పాటతో ఈ సినిమాకు బజ్ ఏర్పడింది. కానీ ఎంత సాంగ్స్ హిట్టు అయితే మాత్రం సినిమాలో కంటెంట్ కూడా జనాలకు నచ్చాలి కదా.. శశి విషయంలో అదే జరిగిందట. మొత్తానికి ఆది సాయికుమార్ ఖాతాలో మరో ప్లాప్ పడిందని టాక్. మరి స్క్రిప్ట్ సెలక్షన్ లో ఇకనైనా జాగ్రత్త పడతాడేమో చూడాలి!