కమలహాసన్ ఇటీవల మొత్తానికి విక్రమ్ సినిమాతో సక్సెస్ అందుకుని ఫామ్ లోకి వచ్చేసాడు. గత కొన్నేళ్లుగా వర్స్క్ అపజయాలు చూసిన ఈ విశ్వ నటుడు విక్రమ్ సినిమాతో కేవలం సక్సెస్ మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా బలంగా నిలదొక్కుకున్నాడు.
బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమా భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అయితే అందించింది. ఇక నెక్స్ట్ తదుపరి సినిమాలను కూడా వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో పూర్తి చేయాల్సిన ఇండియన్ 2 సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే.
తప్పకుండా ఆ సినిమాను మళ్ళీ మొదలుపెట్టి భారీ స్థాయిలోనే విడుదల చేయనున్నట్లు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కమలహాసన్ కు సంబంధించిన ఒక పాత సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా 3D టెక్నాలజీ తో అనుసంధానం చేసి సరికొత్తగా సినిమా పిక్చర్ క్వాలిటీని కూడా పూర్తిగా మార్చేసి కొత్తగా విడుదల చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి.
అయితే సాధారణంగా ఏదైనా సక్సెస్ సినిమా అయితేనే 3D టెక్నాలజీతో విడుదల చేసే ఆకట్టుకున్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాలీవుడ్లో అయితే గత 30 ఏళ్ల కాలం నాటి సినిమాలను కూడా 3D టెక్నాలజీతో విడుదల చేస్తున్నారు. ఆ మధ్య రజనీకాంత్ శివాజీ సినిమాను కూడా అదే తరహాలో విడుదల చేసి మంచి కలెక్షన్స్ కూడా అందుకున్నారు.
అయితే ఇప్పుడు కమలహాసన్ సంబంధించిన ఒక డిజాస్టర్ సినిమాను త్రీడీలో విడుదల చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు కమలహాసన్ మొదటి సారి ఒక సైకో పాత్రలో నటించిన ఆలవందాన్ అనే సినిమా 3Dలో విడుదల చేయనున్నారట.
తెలుగులో ఈ సినిమా అభయ్ అనే పేరుతో విడుదలైంది. 2001లో వచ్చిన ఈ సినిమా తమిళంలో ఓ మోస్తారుగా ఆడినప్పటికీ తెలుగులో అయితే డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు అలాంటి సినిమాను 3D టెక్నాలజీతో మిక్స్ చేసే నవంబర్ 7న కమలహాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరి ఈ ప్రాజెక్టు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.